Thursday, May 2, 2024
- Advertisement -

హాంకాంగ్​కి అమెరికా మద్దతు..!

- Advertisement -

హాంకాంగ్​లో జాతీయ భద్రత చట్టం అమలు చేసిన అనంతరం దాని స్వయం ప్రతిపత్తిని బలహీనపరిచే దిశగా కొత్త నిబంధనలు అమలు చేస్తోంది చైనా. హంకాంగ్​ శాసనమండలి ఎన్నికలు నిలిపివేయడమే కాకుండా… హాంకాంగ్​ ప్రజల హక్కులు, స్వేచ్ఛను హరించేందుకు కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. దీనిపై అమెరికా నేతృత్వంలోని ఐదు దేశాలు స్పందించాయి.

హాంకాంగ్​ ప్రజల హక్కుల్ని అణగదొక్కడానికి… చైనా చేపట్టిన చర్యలను తక్షణమే ఆపాలని అమెరికా నేతృత్వంలోని ఐదు సభ్యదేశాలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. హాంకాంగ్​ శాసనసభకు ప్రతినిధులుగా ఎన్నికైన వారిని అనర్హులుగా ప్రకటించడానికి అమలు చేస్తున్న కొత్త నిబంధనలపై తీవ్ర ఆందోళ వ్యక్తం చేశాయి.

ప్రపంచంలో ఆర్థిక సంక్షోభంలో ఉన్న అన్ని దేశాల గళాలను నొక్కివేసేలా చైనా వైఖరి ఉందని ఆరోపించాయి.చైనా తక్షణమే వాటిని నిలిపివేయాలని అమెరికాతో పాటు ఆ బృందంలో ఉన్న ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్​, బ్రిటన్​ దేశాల విదేశాంగ మంత్రులు సంయుక్తంగా ప్రకటించారు. హాంకాంగ్​ శాసనసభ్యులకు వ్యతిరేకంగా చైనా తీసుకున్న చర్యలను తిరిగి పరిశీలించి, వెంటనే శాసనమండలి సభ్యులను తిరిగి నియమించాలని చైనాను కోరారు.

జో బైడెన్‌.. పంచాయతీ షురూ..!

పెరూ అధ్యక్షుడు మాన్యువల్​ మెరినో రాజీనామా..!

మన మాజీ ప్రధాని పై ఒబామా రాతలు..!

మొదటి సారి బైడెన్ విమర్శలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -