Saturday, April 27, 2024
- Advertisement -

ద్విపాత్రాభినయంలో మెప్పించిన తెలుగు హీరోయిన్లు ఎవరో తెలుసా?

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో మన అభిమాన హీరో సినిమా విడుదల అవుతోంది అంటే ఆ హడావుడి వేరుగా ఉంటుంది. అలాంటిది ఆ హీరో సినిమాలో రెండు వేరు వేరు పాత్రల్లో కనిపిస్తే ఆ సినిమా పై మరింత ఆసక్తి,అంచనా సహజంగానే పెరుగుతుంది కదా. అలాగే వెండితెరపై మన అభిమాన హీరోయిన్స్ ద్విపాత్రాభినయంలో అప్పుడప్పుడు కనిపిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ద్విపాత్రాభినయంలో కనిపించిన కొందరి హీరోయిన్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ అనుష్క “సూపర్” మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. బ్లాక్ బస్టర్ మూవీ “అరుంధతి” సినిమాలో అనుష్క రెండు డిఫరెంట్ పాత్రలో నటించి విశేష ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా అనుష్క అరుంధతి పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిష”మోహిని” సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. కన్నడ బ్యూటీ ప్రియమణి తెలుగులో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె “చారులత” సినిమాలో రెండు పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Also read:రాజమౌళి షార్ట్ ఫిలిం.. ఆర్ఆర్ఆర్ కంటే ముందే విడుదల!

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ “మగధీర” సినిమాలో రెండు పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా హీరో రామ్ జంటగా “ఎందుకంటే ప్రేమంట”సినిమాలు డ్యూయల్ రోల్ లో అద్భుతంగా నటించింది. అచ్చ తెలుగు అమ్మాయి గా ప్రేక్షకాదరణ పొందిన హీరోయిన్ అంజలి “గీతాంజలి” సినిమాలో ద్విపాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Also read:వయసుపై నెటిజెన్ కామెంట్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హీరోయిన్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -