Monday, May 20, 2024
- Advertisement -

ఈ సెలబ్రిటీల రిలేషన్స్ గురించి తెలుసా..?

- Advertisement -
tollywood stars relationships

వెండితెరపై..   నటీనటులు ఎన్నో చుట్టరికాలతో, సంబంధాలతో  నటిస్తుంటారు. అయితే  ఈ సంబంధాలన్నీ రీల్ లైఫ్ లో మాత్రమే. రియల్ లైఫ్ లో వారికి ఎలాంటి  సంబంధాలూ  ఉండవు.  అయితే రియల్ లైఫ్ లో  కూడా చుట్టరికం ఉన్న నటీనటులు మన టాలీవుడ్ లో చాలా మందే ఉన్నారు. హీరో  గోపీచంద్ మరో ప్రముఖ నటుడు శ్రీకాంత్ మేనకోడలినే వివాహం చేసుకున్నాడు. డైరెక్టర్ బోయపాటి శ్రీను..  ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి వరుసకు అన్నదమ్ములవుతారు. డైరెక్టర్ కొరటాల శివకు పోసాని మావయ్య అవుతారు.  సీతారామశాస్త్రి మేనకోడల్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వివాహం చేసుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి దర్శక ధీరుడు రాజమౌళికి అన్నయ్య అవుతారు.

గుణ్ణం గంగరాజు రమారాజమాళికి అన్నయ్య అవుతాడు. అలాగే గుణ్ణంగంగారాజు బావమరిదే చంద్రశేఖర్ ఏలేటి. కంత్రి సినిమాలో చేసిన తనీషా బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ కు చెల్లెలు. నటుడు ఉత్తేజ్ .. రచయిత సుద్ధాల అశోక్ తేజకు మేనల్లుడవుతారు. ఇక డైరెక్టర్ మెహర్ రమేష్ మెగా హీరోలకు కజిన్ అవుతారు. హీరో శర్వానంద్ బ్రదర్..  హీరో రామ్ చెల్లెల్ని వివాహం చేసుకున్నారు.  సందీప్ కిషన్..  ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడుకి మేనల్లుడు అవుతాడు.   సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు చిరంజీవికి  మేనల్లుళ్లు అవడంతో అల్లు అర్జున్, అల్లు శిరీష్,  సాయి ధరమ్ తేజ్ , వరుణ్ తేజ్ లు వరుసకు అన్నదమ్ములు అవుతారు. సుమంత్.. కీర్తిరెడ్డిని వివాహం చేసుకోవడంతో.. కీర్తిరెడ్డి నాగార్జునకు కూతురు వరుస అవుతుంది. నటి విజయశాంతికి అలనాటి నటి విజయలలిత పిన్ని అవుతుంది.

కమల్ హాసన్.. సుహాసినికి బాబాయ్ అవుతాడు. అంటే శృతిహాసన్..  సుహాసినికి చెల్లెలు, సుహాసిని భర్త మణిరత్నంకు మరదలవుతుంది. సీతారామశాస్త్రి కృష్ణవంశీని హిందూ ధర్మప్రకారం దత్తత తీసుకున్నారు. కాబట్టి రమ్మకృష్ణ..  సీతారామశాస్త్రికి కోడలన్నమాట. శ్రీదేవికి.. గులాబి సినిమా హీరోయిన్ మహేశ్వరి చెల్లెలు అవుతుంది. బాలకృష్ణ కూతురు నారా వారి కోడలు అవ్వడంతో.. చంద్రబాబు తమ్ముడు కొడుకైన నారా రోహిత్ బాలయ్యకి అల్లుడి వరస అవుతుంది.  తరుణ్..  అలనాటి టాలీవుడ్ హీరోయిన్ రోజారాణి కుమారుడు. జయసుధకు నటి, నిర్మాతైన విజయనిర్మల మేనత్త అవుతుంది.  టాలీవుడ్ లో ఇంకెన్ని రిలేషన్స్ రానున్నాయో చూడాలి. 

Related

  1. ప్రభాస్ ను ఇంటికి పంపించిన రాజమౌళి!
  2. రాజమౌళి తండ్రి కాళ్లు పట్టుకున్న సుకుమార్‌.. ఎందుకు..?
  3. రాజమౌళికి ఊహించని షాక్ ఇచ్చిన ర‌ష్మీ
  4. ఎన్టీఆర్ ని రాజమౌళి ఎందుకు తిట్టాడంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -