Tuesday, May 14, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ని రాజమౌళి ఎందుకు తిట్టాడంటే?

- Advertisement -

ఎస్ ఎస్ రాజమౌళికి ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఎన్టీఆర్ సినిమాతోనే రాజమౌళి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. అయితే ఎన్టీఆర్ అంటే ఇప్పుడు రాజమౌళి కి బాగా ఇష్టం. కానీ  స్టూడెంట్ నెం 1 సినిమా చేసే టైంలో ఎన్టీఆర్ ని చూసి లోపల తిట్టుకునేవాడట రాజమౌళి. అంతేకాదు స్విట్జర్లాండ్ కు పాటల షూట్ కోసం వెళ్లిన టైంలో ఒకే రూములో రాజమౌళి తో పాటు ఎన్టీఆర్ కు కూడా కేటాయించారట.

ఇక మన జక్కన 9 గంటల కల్లా నిద్రపోయేవాడట. కానీ ఎన్టీఆర్ మాత్రం రాత్రి పన్నెండు గంటల అయిన టివి లో ఏవేవో ప్రోగ్రామ్స్ చూస్తూ ఏంజాయ్ చేశేవాడట. కానీ రాజమౌళికి అది చాలా ఇబ్బందిగా ఉండేదట. దాంతో ఎన్టీఆర్ ని బయటకు ఏమి అనలేక లోలోన బాగానే తిట్టుకునే వాడట. ఇక స్టూడెంట్ నెం 1 రిలీజ్ అయిన తర్వాత రాజమౌళి, ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు.

జక్కన్న డైరెక్షన్ లో ఎన్టీఆర్ స్టూడెంట్ నెం 1 తర్వాత సింహాద్రి , యమదొంగ సినిమాలు కూడా చేసారు. ఇప్పుడు రాజమౌళి కి అత్యంత ఇష్టమైన హీరో ఎన్టీఆర్ అందుకే ఈ తిట్ల గురించి చెబుతున్నాడు. పదిహేనేళ్ళ క్రితం ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం స్టూడెంట్ నెం 1. ఆ చిత్రం రిలీజ్ అయ్యింది సరిగ్గా ఈరోజే కావడంతో ట్వీట్ చేస్తూ ఆ విషయాలను గుర్తు చేసుకున్నాడు జక్కన్న. ఇక అతి త్వరలోనే రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై రాజమౌళి క్లారీటీ ఇవ్వాల్సి ఉంది.

Related

  1. ఎన్టీఆర్ కి భయపడ్డ అల్లు అర్జున్!
  2. ఎన్టీఆర్‌ ని వదిలి బన్నీ కోసం వచ్చాడు
  3. రాజమౌళి సీక్రెట్స్ బయట పెట్టిన అనుష్క!
  4. చిరు దెబ్బకి షాక్ అయిన రాజమౌళి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -