హాస్యభరితమైన సినిమాగా ‘వెల్‌కం టు న్యూయార్క్’ సినిమా బాలీవుడ్‌లో రాబోతోంది. ఈ సినిమాలో మన బాహుబలిని ఎదురించిన భళ్లాల దేవ కూడా నటిస్తుండడం విశేషం. రానా దగ్గుబాటి, కరణ్ జోహార్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వెల్‌కం టు న్యూయార్క్’ చక్రి తొలేటి దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. భారతీయ తొలి త్రీడీ కామెడీ చిత్రంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేసింది. ట్రైలర్ చూస్తుంటే మొత్తం హాస్యంతో కూడుకున్న సినిమాగా తెలుస్తోంది.
కరణ్ జోహార్ ద్విపాత్రాభినయం చేస్తుండగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అతిథి పాత్రలో మెరుస్తున్నాడు. ఇంకా బొమన్ ఇరానీ, లారా దత్తా, రితేశ్ దేశ్‌ముఖ్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.సినిమాలో న్యూయార్క్‌లో నిర్వహించే ఓ ఈవెంట్‌కు వీరంతా వెళ్తారు. అక్కడ ఏం జరిగింది అనే విషయాలను కామెడీగా ఓ సినిమాను తెరకెక్కించారు. చివరకు కరణ్ జోహర్‌ను మోసుకొస్తూ రానా ‘జై మాహిష్మతి’ అని అరచడం ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను ఫిబ్రవరి 23వ తేదీన థియేటర్లలో కనిపించనుంది.