Tuesday, May 21, 2024
- Advertisement -

క్వీన్ సినిమాకి ఓకే చెప్పిన త్రిష

- Advertisement -

2014 లో విడుదల అయ్యి సూపర్ హిట్ కొట్టి. అనేక అవార్డులు అందుకున్న సినిమా క్వీన్ , కంగనా రనౌట్ హీరోయిన్ గా చేసిన ఈ సినిమా విమర్శకుల ప్రసంసలు కూడా బాగానే అందుకుంది. ఈ సినిమాని ఎప్పటి నుంచో తెలుగు తో పాటు తమిళం లో పెద్ద హీరోయిన్ తో రీమేక్ చేద్దాం అని చూస్తున్నారు కానీ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు బాలీవుడ్ లో వెళ్లినట్టు ఇక్కడ వెళతాయా లేదా అనే మీమాంస లో ఆగిపోయారు.

అయితే ఇన్నాళ్ళ తరవాత ఈ సినిమాని చెయ్యడానికి సీనియర్ హీరోయిన్ త్రిష ఒప్పుకోవడం తో రీమేక్ పట్టాలు ఎక్కేలా కనిపిస్తోంది. కొద్దికాలంగా లేడీ ఓరియంటడ్ తరహా సినిమాలు చేయాలని కోరుకుంటూ వస్తోన్న త్రిష ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది.

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మితమయ్యే ఈ సినిమాకు ప్రముఖ నటి రేవతి దర్శకత్వం వహించనున్నారు. త్యాగరాజన్ నిర్మించనున్న ఈ సినిమాకు సుహాసిని స్క్రిప్ట్ సమకూర్చడం విశేషంగా చెప్పుకోవాలి.

Related

  1. తాగి నడిరోడ్డు మీద రచ్చ చేసిన త్రిష!
  2. త్రిష, నయన్ కలిసి నటిస్తున్నారట
  3. నిర్మాతలని రెచ్చగొడుతున్న త్రిష ?
  4. అప్పటి హాట్ హీరోయిన్ మళ్ళీ వచ్చింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -