Saturday, April 27, 2024
- Advertisement -

నేను కూడా బాడీ షేమింగ్ కు గురయ్యా : తెలంగాణ గవర్నర్

- Advertisement -

శ్యామ్ సింగరాయ్ సినిమాలో దేవదాసి పాత్రలో నటించిన సాయి పల్లవి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు . దేవదాసి పాత్ర సాయి పల్లవికి సూట్ కాలేదని.. ఆ పాత్రలో ఆమె అందవిహీనంగా కనిపించిందంటూ సాయి పల్లవి పర్సనాలిటీపై ఒక తమిళ పత్రిక కథనం ప్రచురించింది. సోషల్ మీడియాలో సాయి పల్లవిపై కొందరు పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా చేశారు.

సాయి పల్లవిపై చేస్తున్న బాడీ షేమింగ్ పై తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ స్పందించారు. సోషల్ మీడియాలో సాయి పల్లవిపై వస్తున్న ట్రోలింగ్ తనను తీవ్రంగా బాధించాయని అన్నారు. మహిళలు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా వారిని తక్కువగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను కూడా గతంలో బాడీ షేమింగ్ కు గురైనట్టు వెల్లడించారు. తన ఆకారం, రంగులపై కొందరు కామెంట్ చేశారని చెప్పారు. కానీ వాటిని ధైర్యంగా ఎదురుకున్నట్టు తెలిపారు. కామెంట్స్ బారిన పడకుండా ఉండడానికి మనం ఏమీ మహాత్ములం కాదు. కానీ ఇవాంటివి జరిగినప్పుడు అవతలి వారు బాధపడతారు అనేది గుర్తించాలి అని ఆమె ఒక తమిళ టీవీకి ఇచ్చిన ఇంటర్య్వూలో చెప్పారు.

శ్రీదేవి కుమార్తె తెలుగులో అరంగేట్రానికి రంగం సిద్ధం

విజ‌య్ షాకింగ్ రెమ్యూన‌రేష‌న్

మ‌రో సీక్వెల్ కు సిద్ధ‌మ‌వుతున్న డార్లింగ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -