Sunday, April 28, 2024
- Advertisement -

మూడు వారాల తర్వాత తెరుచుకోనున్న విద్యాసంస్థలు

- Advertisement -

దాదాపు మూడు వారాల తర్వాత తెలంగాణలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ప్రారంభించుకునేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వ సందీప్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

పాఠశాలల్లో కరోనా నిబంధనలను పక్కాగా అమలు చేయాలని, నిరంతరం శానిటైజేషన్ చేస్తుండాలని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు యాజమాన్యాలు, ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా తొలుత జనవరి 8 నుంచి పాఠశాలను తెరవాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది.

కాగా షాపింగ్ కాంప్లెక్స్ లు ,సినిమా థియేటర్లపై లేని నియంత్రణ కేవలం విద్యా సంస్థలపై మాత్రమే ఎందుకని విద్యావేత్తలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇటీవల న్యాయస్థానం కూడా విద్యాసంస్థల ప్రారంభంపై ప్రభుత్వం అభిప్రాయాన్ని చెప్పాలని కోరింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1 నుంచి తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు స్వాగతించాయి.

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పట్లో లేనట్లేనా..?

బెదిరిస్తున్నారు చర్యలు తీసుకోండి టీం ఇండియా మాజీ కెప్టెన్‌ ఫిర్యాదు

ఐపీఎస్ అధికారులకు ‘బండి’ వార్నింగ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -