Friday, April 26, 2024
- Advertisement -

క్రికెట్ వెన్నెముకను విరిచేస్తారా ..

- Advertisement -

బీసీసీఐపై చేస్తున్న విమర్శలకు కొందరు మాజీ సీనియర్లు మరింత పదును పెడుతున్నారు. తాజాగా రంజీ ట్రోఫీ నిర్వహణ విషయంలో బీసీసీఐ తీరును టీం ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తీవ్రంగా తప్పుపట్టాడు. భారత క్రికెట్ వెన్నెముకను విరిచేస్తారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు.

జవనరి 13 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న దేశవాళీ టోర్నమెంట్ రంజీ ట్రోఫీని కరోనా పరిస్థితులు నేపథ్యంలో వాయిదా వేశారు. కాగా ఫిబ్రవరి చివరి వారం.. జూన్ నెలల్లో నిర్వహించనున్నామని బీసీసీఐ సెక్రెటరీ జైషా వెల్లడించారు. మార్చిలో ఐపీఎల్ ఉన్నందున రెండు దశల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ ప్రకటనపై రవిశాస్త్రి మండిపడ్డాడు.

రంజీ ట్రోఫీ తోనే ఎంతో మంది అత్యుత్తమ టీం ఇండియా ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారని, దేశవాళీ క్రీడ భారత క్రికెట్ కు వెన్నెముక అని రవి చెప్పారు. రంజీ ట్రోఫీ కన్నా కాసులు కురిపించే ఐపీఎల్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఇది తగదని మరి కొంత మంది సీనియర్లు బాహాటంగానే బీసీసీఐ తీరును తప్పుపడుతున్నారు.

భారత క్రికెట్ ను తలదించుకునేలా చేయకండి

మా ప్రైవసీని గౌరవించండి

బెదిరిస్తున్నారు చర్యలు తీసుకోండి టీం ఇండియా మాజీ కెప్టెన్‌ ఫిర్యాదు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -