Friday, March 29, 2024
- Advertisement -

ఆచార్య గురించి మరో క్రేజి బజ్.. సినిమాలో ఆ సాంగే హైలెట్?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి తన తనయుడు రామ్ చరణ్ తో కలిసి తాజాగా రూపొందిస్తున్న చిత్రం “ఆచార్య” . ఈ మూవీకి కి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించగా, హీరో రామ్ చరణ్ నిర్మాణ సారథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది. మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వస్తున్నా “ఆచార్య ” మూవీ పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆచార్య మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ఫస్ట్ లుక్ తో సినిమాపై ఆసక్తి నెలకొనగా ఇటీవలే ఇటీవల విడుదలైన‘లాహే.. లాహే’ అనే పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని చిరు అభిమానుల్లో మరింత హుషారు నింపింది.ఇక సినిమాలో రామ్ చరణ్ సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్నాడు. మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్‌‌గా నటిస్తుండగా,చరణ్‌ జోడిగా పూజా హెగ్డే నీలాంబరి అనే పాత్ర చేస్తోంది.

Also read:ప్రభాస్ సలార్ సినిమాలో సందడి చేయనున్న సీనియర్ నటి?

ఆచార్య మూవీ లో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ ఈ మూవీలో రెండు పాటల్లో నటిస్తున్నాడట. ఒకటి సోలో సాంగ్ కాగా మరొకటి పూజా హెగ్డే తో రొమాంటిక్ సాంగ్. ఈ సాంగ్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని, సంగీత దర్శకుడు మణిశర్మ ఈ పాటకు చక్కటి బాణీలను సమకూర్చారని , ఈ పాట అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.

Also read:తుఫానులో సందడి చేసిన నటి… తిట్టిపోస్తున్న జనం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -