మెగా స్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ తేజ్ భార్య ఉపాసన మీడియాకు చాలా దూరంగా ఉంటారు. అయితే ఇటివలే ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనపై వస్తున్న విమర్శలకు గట్టిగానే సమాధానమిచ్చారు. అయితే రీసెంట్ గా ఆమె గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు అతిథిగృహంలో గత శుక్రవారం జరిగిన అఖిల్, శ్రీయా భూపాల్ నిశ్చితార్థ పంక్షన్ లో ఉపాసన హంగామా చేసినట్లు తెలిసింది. అతి తక్కువ సంఖ్యలో సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో నాగచైతన్య , సమంత లు జంటగా వచ్చి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవగా, ఉపాసన తన ప్రవర్తనతో అందరి కళ్ళు తనవైపు తిప్పుకున్నారు.
మెగాస్టార్ 150 వ సినిమా షూటింగ్ లోను, రామ్ చరణ్ ధృవ ప్రమోషన్ లో బిజీగా ఉండగా ఆ కుటుంబం తరుపున హాజరైన ఆమె.. స్నేహితులతో కలిసి కొత్త జంటను ఆటపట్టించిందంట. ఇదివరకే పరిచయం ఉండడంతో ఉపాసన టీజింగ్ ని శ్రీయ భూపాల్ ఎంజాయ్ చేసిందని సమాచారం. పబ్లిక్ కార్యక్రమాల్లో ఎప్పుడూ నోరు కూడా మెదపని మెగా కోడలు టీజ్ చేయడం చూసిన అతిథులు ఆశ్చర్యపోయారంట. ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరిది అదే ఫీలింగ్.
Related