సరికొత్త రికార్డు సాధించిన ఉపాసన!

Upasana storms into 1 Million club

ఓవర్సీస్ వసూళ్లలో మిలియన్ డాలర్ మంచి గుర్తింపు ఉంది. అలాగే యూట్యూబ్ వ్యూస్ లో కూడా ఆ మార్క్ అంతే ఇంపార్టెంట్. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపసాన ఇచ్చిన ఇంటర్వ్యూ.. ఇప్పుడు యూట్యూబ్ లో 10 లక్షలకు పైగా వ్యూస్ సాధించేసిందీ వీడియో.

నిజానికి ఉపాసన అపోలో గ్రూప్ కి వారసురాలు అయినా.. రామ్ చరణ్ తో పెళ్లి వరకూ ఈమె గురించి కామన్ ఆడియన్స్ కు అసలేమీ తెలియదనే చెప్పాలి. కానీ ఆమె మెగా ఫ్యామిలీలోకి వచ్చాక..  ఉపాసన క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అందులోను తను చెప్పదలచుకున్న మాటలను స్ట్రెయిట్ గా చెప్పే ఆమె మెంటాలిటీ కూడా హెల్ప్ అయింది. మెగా డాటర్ ఇన్ లా.. మొదటిసారిగా మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం అనే పాయింట్ చాలా మందికి కనెక్ట్ కాగా.. అమె డేరింగ్ గా చెప్పిన ఆన్సర్స్ కూడా యూట్యూబ్ వీడియో హిట్ అయేందుకు సహకరించాయి.

ఒకే వారంలో 10.50లక్షల వ్యూస్ సాధించడం మాములు విషయం కాదు. ఉపసాన ఇంటర్వ్యూ కి ఈ స్థాయిలో వ్యూస్ రావడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసినా.. ఆ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన బోల్డ్ ఆన్సర్స్ కూడా ఇందుకు కారణంగా చెప్పచ్చు. ఆ మహిళా విలేఖరి.. ‘మీ ఆయనలో మీకు ఏం ఇష్టం’ అని అడిగితే.. ‘అదేం ప్రశ్న.. మీకు మీ ఆయనలో ఏది నచ్చుతుందో చెప్పండి’ అంటూ ఉపాసన ఇచ్చిన రిటార్ట్ అదరహో అనాల్సిందే. కొణిదెల ఉపాసన కామినేని గా ఇలాంటి షాకింగ్ జవాబులు చాలానే ఇచ్చింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన.

{youtube}IUxMO9dcq_E{/youtube}

Related

  1. షాకింగ్ చేస్తున్న రామ్ చరణ్ ఆస్థి వివరాలు!
  2. గొప్ప మనసు ఉన్న వ్యక్తి రామ్ చరణ్ ఉపాసనను కష్టపెడుతున్న రామ్ చరణ్
  3. రామ్ చరణ్ కోసం పవన్ ఏం చేస్తున్నాడో తెలుసా?
  4. షాకింగ్ నిజాలు చెప్పిన ఉపాసన