Monday, May 6, 2024
- Advertisement -

ఎన్టీఆర్ రికార్డులను బ్రేక్ చేయబోతున్న ఉపాసన!

- Advertisement -
upasana is a new competitor for ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు మంచి జోష్ మీద ఉన్నాడు. ఎన్టీఆర్ కి టెంపర్ సినిమా నుంచి టైం మారింది. ఈ చిత్రం తర్వాత చేసిన నాన్నకు ప్రేమతో సినిమా కూడా బంపర్ హిట్ అయ్యింది. ఇటివలే చేసిన జనతా గ్యారేజ్ చిత్రం కూడా మంచి హిట్ సాధించింది. దీంతో ఎన్టీఆర్ కు సంబంధించిన ఏ చిన్న వీడియో వచ్చినా రెస్పాన్స్ భారీగా వస్తోంది. యూట్యూబ్ లో తారక్ వీడియో రావడమే ఆలస్యం వేగంగా లక్షల వ్యూస్ మార్క్ ని దాటేస్తోంది.

జనతా గ్యారేజ్ సినిమా… టీజర్, ట్రైలర్, సాంగ్స్ వీడియోలను 5 మిలియన్ కంటే ఎక్కువ సార్లు చూసారు. ఈ రెంజ్ లో యూట్యూబ్ లో చక్రం తిప్పుతున్న ఎన్టీఆర్ కి మెగా స్టార్ కోడలు ఉపాసన గట్టి పోటీ ఇవ్వడానికి యూట్యూబ్ లో ప్రవేశించింది. ఉపాసన ఎంట్రీతోనే ఎన్టీఆర్ రికార్డులను షేక్ చేస్తోంది. గత వారంలో ఉపాసన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె తన తాత గురించి, భర్త రామ్ చరణ్ తేజ్ తో ప్రేమ, పెళ్లి విషయాలను వెల్లడించింది.

తనపై వచ్చిన విమర్శలన్నింటికీ దైర్యంగా, స్పష్టంగా తిప్పికొట్టింది. ఉపాసన  ఎంతో ఆత్మ విశ్వాసంతో మాట్లాడింది. దాంతో ఈ వీడియోని చూసేందుకు యువత ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. ఈ వీడియో రిలీజ్ అయిన వారం లోపునే ఒక మిలియన్ వ్యూస్ మార్క్ ని దాటేసి.. రికార్డు సృష్టించింది. అతి త్వరలోనే 5 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేస్తుందని నెటిజనులు అంచనా వేస్తున్నారు. అలా జరిగితే ఎన్టీఆర్ రికార్డులన్నీ మరుగున పడిపోయినట్టే.

Related

  1. సరికొత్త రికార్డు సాధించిన ఉపాసన!
  2. షాకింగ్ నిజాలు చెప్పిన ఉపాసన
  3. ఉపాసనను కష్టపెడుతున్న రామ్ చరణ్
  4. మోహన్ లాల్ ,ఎన్టీఆర్ ని వాడేస్తున్నాడా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -