Thursday, April 25, 2024
- Advertisement -

ఎన్టీఆర్ తో ‘ఉప్పెన’ దర్శకులు?

- Advertisement -

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. పవన్, రామ్ చరణ్, బన్ని,సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వీరంతా చిరంజీవి వారసులుగా వచ్చినా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా సాయిధరమ్ తేజ్ తనమ్మ వైష్ణో తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ‘ఉప్పెన’ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో కన్నడ బ్యూటీ కృతి శెట్టి నటించింది.

ఉప్పెన మంచి హిట్ కావడంతో దర్శకుడికి బాగా డిమాండ్ పెరిగింది. అయితే అతన్ని బయటకు వెళ్ళనివ్వకుండా మరో రెండు సినిమాలకు మైత్రి మూవీ మేకర్స్ లాక్ చేసేసుకుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు మొదటి నుంచి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇదే గనక జరిగితే అది ఫుల్ లెన్త్ మాస్ మూవీ అంటున్నారు.

బుచ్చిబాబు ఈ సినిమా వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాతలకు కథను వినిపించినట్లు సమాచారం అందుతుంది..అయితే ఎన్టీఆర్ కు బుచ్చిబాబుకు ముందు నుంచే పరిచయం ఉంది. సుకుమాదర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా నాన్నకు ప్రేమతో సినిమాకు బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన విషయం తెలిసిందే.

దుర్గగుడి చరిత్రలో తొలిసారిగా సుదీర్ఘ సోదాలు.. ఇంత అవినీతా?

బన్నీతర్వాతి చిత్రం పాన్ ఇండియా మూవీ !

మహబూబాబాద్ జిల్లాలో అబార్షన్ల రాకెట్ గుట్టు రట్టు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -