Saturday, May 4, 2024
- Advertisement -

విజయసాయిరెడ్డి పాదయాత్ర.. రూట్ ఫిక్స్.. బహిరంగ సభ ఫిక్స్..!

- Advertisement -

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్టీల్‌ప్లాంట్‌ మెయిన్‌గేట్‌ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. సాయంత్రం కూర్మన్నపాలెం కూడలిలో వైసిపి ఆధ్వర్యంలో బహిరంగ సభను తలపెట్టారు.

విశాఖ జిల్లాలో ప్రతి భూ ఆక్రమణ వెనుక రాజకీయ నాయకులుంటున్నారు. తమ ప్రయోజనాల కోసం పేదల పేర్లను ఉపయోగించుకుని భూములను కొట్టేయాలని చూస్తున్నారు. భూముల వెనుక ఎంత పెద్ద నేతలున్నా ఉపేక్షించేది లేదు. అన్నీ సక్రమంగా ఉన్న భూ వివాదాలను మాత్రం వెంటనే పరిష్కరించండి” అని రెవెన్యూ అధికారులకు వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు.

రాజకీయ నాయకులంతా దొంగలు కారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేం గెలిచే వచ్చాం. ఆనందపురం మండలం పాలవలస భూముల్లో మా సొంత చినమామకు చెందిన ఎకరం ఉంది. ఆ భూములకు సంబంధించి అన్ని ఆధారాలు సవ్యంగానే ఉన్నా ఎన్‌వోసీ ఇవ్వడం లేదు. రాజకీయ నాయకులకు భూములుంటే దొంగలైపోతారా..? అది చాలా తప్పుడు మాట.. బాధనిపిస్తోంది. దొంగలుంటే వారిపై చర్యలు తీసుకోండి. తప్పుడు భూములైతే వదిలేసుకుంటా కానీ జగన్‌ ప్రభుత్వానికి అపకీర్తి తీసుకురాను” అని ఆవేదన వ్యక్తం చేశారు.

‘వైట్ టీ’తో ఆరోగ్యం ప‌దిలం

దుబాయ్ పోలీస్ స్టేషన్‌లో హీరో మ‌హేష్ బాబు!

పెట్రోల్ లీట‌ర్ కు ఒక్క రూపాయేన‌ట‌!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -