Wednesday, April 24, 2024
- Advertisement -

వకీల్ సాబ్ టైటిల్ కార్డ్ అర్థం వివరించిన వేణు శ్రీరామ్.. వైరల్ గా మారిన ఫోటో!

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకున్న పవర్ స్టార్ కొంత విరామం తర్వాత “వకీల్ సాబ్” సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసినదే. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం “పింక్” చిత్రానికి రీమేక్ గా తెలుగులో వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ను ఓ పవర్ ఫుల్ లాయర్ పాత్రలో చూసి అభిమానులు పండగ చేసుకున్నారు.

నిజానికి దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ కి పెద్ద అభిమాని.తన అభిమాన హీరోని తెరపై ఏ విధంగా చూపించాలో వేణు శ్రీరామ్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ను అదేవిధంగా చూపించాడు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యి ఇక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Also rea:కొరటాలను టార్గెట్ చేసిన ఆ బడా నిర్మాత.. ఆచార్యకు కష్టాలు తప్పవా?

ప్రస్తుతం పవన్ ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇదివరకు పవన్ నటించిన అన్ని సినిమాలలో ఆయన టైటిల్ కార్డ్ ఒకే విధంగా ఉండేది. కానీ వకీల్‌సాబ్ సినిమాలో మాత్రం పంచభూతాలు కలిసి ఒక నక్షత్రంగా ఏర్పడి.. ఆ తర్వాత పవర్‌స్టార్ అని వచ్చేలా టైటిల్‌కార్డును డిజైన్ చేయించాడు వేణు శ్రీరామ్. ఇప్పుడు ఈ పంచభూతాల కాన్సెప్ట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కాన్సెప్ట్ కు సంబంధించిన ఓ ఫోటోను పోస్ట్ చేయడంతో ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారి మరోసారి పవన్ అభిమానులను ఆకట్టుకుంది.

Also read:ఈసారి పక్కాగా ప్లాన్ చేసిన బండ్లగణేష్.. డేరింగ్ స్టెప్ తో ప్రేక్షకుల ముందుకు అలా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -