Sunday, May 5, 2024
- Advertisement -

యాక్షన్ థ్రిల్లర్ గా విజయ్ ఆంటోని ‘అగ్ని సిరగుగల్’

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో తమిళ డబ్బింగ్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే తెలుగు చిత్రాలకు పోటీగా నిలిచి కలెక్షన్లు రాబట్టడంలో ‘బిచ్చగాడు’ రికార్డులు బ్రేక్ చేసింది. విజయ్ ఆంటోని నటించిన ‘బిచ్చగాడు’సూపర్ హిట్ అయ్యింది. ఒక శ్రీమంతుడు తన తల్లి ప్రాణాలను నిలబెట్టడం కోసం ‘బిచ్చగాడు’గా మారడమే ఈ సినిమా కథాంశం. ఈ సినిమాలోని ఎమోషన్ ప్రేక్షకులకు ఒక రేంజ్ లో కనెక్ట్ కావడంతో, వసూళ్ల వర్షం కురిసేసింది.

ఈ చిత్రం తర్వాత విజయ్ ఆంటోనికి సరైన హిట్ ఒక్కటంటే ఒక్కటీ లేదు. అయినా వరుస సినిమాలతో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ‘బిచ్చగాడు’ స్థాయిలో అవి విజయవంతం కాకపోయినా, వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు విజయ్ ఆంటోని. నవీన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని తాజా చిత్రంగా ‘అగ్ని సిరగుగల్’ రూపొందుతోంది. యాక్షన్ థ్రిల్లర్, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది.

విజయ్ ఆంటోని గత చిత్రాల మాదిరిగానే, తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో అరుణ్ విజయ్, ప్రకాశ్ రాజ్, అక్షర హాసన్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తరువాత ఈ సినిమాను థియేటర్లకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు.

వైరల్ గా కీర్తి సురేష్ వీడియో.. అవగాహనా కల్పిస్తున్న మహానటి?

వరుణ్ తేజ్ ‘గని’ యాక్షన్ పార్ట్

టాలీవుడ్ విషాదం.. ‘అనుకోని అతిథి’ నిర్మాత కన్నుమూత

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -