Tuesday, April 30, 2024
- Advertisement -

సిగ్గులేకుండా సిగరెట్ కలుస్తున్న వంటలక్క.. వీడియో వైరల్!

- Advertisement -

టాలీవుడ్ బుల్లితెరపై “కార్తీకదీపం” సీరియల్ దాదాపు మూడు సంవత్సరాలుగా అత్యంత ప్రేక్షకాదరణ పొందుతూ టాప్ రేటింగ్ ఉన్న సీరియల్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ సీరియల్ లో మలయాళీ బుల్లితెర నటి ప్రేమి విశ్వనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈమె ఈ సీరియల్లో దీపా అలియాస్ వంటలక్కపాత్రలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.

Also read:నా పెళ్లి ఎప్పుడో నేను చెప్తా.. మీరు గుసగుసలు ఆపండి: కీర్తి సురేష్

కార్తీకదీపం సీరియల్ మొదట కరుతముత్తు అనే పేరుతో మలయాళ భాషలో ప్రసారం అయింది. మలయాళంలో ఈ సీరియల్ సూపర్ హిట్ కావడంతో దాన్ని తెలుగులో కార్తీకదీపంగా ప్రసారం చేస్తున్నారు. విశేషమేమిటంటే మలయాళీ భాషలో కూడా ప్రేమీ విశ్వనాథే హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో తెలుగు భాషలో కూడా ఈమెని హీరోయిన్ గా తీసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.

Also read:బాలయ్య పుట్టిన రోజుకు పెద్ద గిఫ్ట్.. ఏంటంటే?

సీరియల్స్ తో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రేమి విశ్వనాథ్ తాజాగా సిగరెట్ తాగుతూ మాస్ లుక్ లో కనిపించే ఫోటోని షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. వివరాల్లోకెళ్తే అల్లు అర్జున్ సూపర్ హిట్ సాంగ్ సిత్తరాల సిరపడు…అనే పాటలో సరదాగా పర్ఫార్మ్ చేసింది ప్రేమి విశ్వనాథ్. ఇందులో అల్లు అర్జున్ మాదిరిగానే షర్ట్ బటన్స్ తీసేసి స్మోకింగ్ చేస్తూ కోడిపుంజును పట్టుకుని రచ్చ చేస్తూ డాన్స్ వేస్తున్న ఫోటోను, వీడియోను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -