బన్నీకి తన బ్రాండ్ దుస్తులు పంపిన అర్జున్ రెడ్డి!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా ఎదిగారు. ఈ ఏడాది అల వైకుంఠపురములో తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నాడు విజయ్ దేవరకొండ.

తాజాగా అల్లు అర్జున్‌కి టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త బట్టలు పంపాడు. ‘రౌడీ’ బ్రాండ్ తో విజయ్ దేవరకొండ వస్త్ర వ్యాపారం చేస్తోన్న విషయం విదితమే. గ‌తంలోనూ అల్లు అర్జున్‌కి విజ‌య్ దేవరకొండ తన బ్రాండ్ దుస్తులు పంపాడు. ‘అల వైకుంఠ‌పుర‌ములో’ సినిమా వేడుక‌లో వాటిని బన్నీ ధ‌రించి అలరించాడు.

- Advertisement -

విజయ్ దేవరకొండ పంపిన దుస్తులు ధరించిన బన్నీ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. వాటిని తనకు పంపిన విజ‌య్ దేవరకొండతో పాటు రౌడీ క్ల‌బ్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు. ఈ డ్రెస్ తనకు ఎంతగానే నచ్చిందని బన్నీ ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. విజయ్ దేవరకొండ చూపించే ప్రేమ‌కు థ్యాంక్స్ చెబుతున్నానని అల్లు అర్జున్ పేర్కొన్నాడు. 

Also Read

మన స్టార్స్ నోరు జారినప్పుడు.. జరిగిన వివాదం..!

మన సెలబ్రిటీస్ లో ఎంత మంది డాక్టర్లు ఉన్నారో చూడండి..!

దేత్తడి హారిక గురించి మనకు తెలియని విషయాలు..!

సర్జరీతో అందం మార్చుకున్న హీరోయిన్స్ ఎవరో చూడండి..!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...