Friday, April 26, 2024
- Advertisement -

ఆగిన పుష్ప సినిమా షూటింగ్..!

- Advertisement -

అల్లు అర్జున్ సుకుమార్ కాంబో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నా సినిమా పుష్ప. వీరి కాంబో లో ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దీంతో పుష్ప సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ తర్వాత నవంబర్ 10నుండీ తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది.

మనకందు తున్న సమాచారం ప్రకారం షూటింగ్ అగిపోయిందని తెలుస్తుంది. ఇటీవలే సినిమా యూనిట్ సభ్యుడు ఒకరు కరోనా తో మృతి చెందారు. సినిమా యూనిట్ సభ్యులందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. పలువురికి కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. దీంతో సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేసినట్టు సమాచారం తెలుస్తుంది.

సినిమా షూటింగ్ వాస్తవానికి కేరళ లో జరగాల్సి ఉండే.. కరోనా కారణంగా అప్పుడు షూటింగ్ అగిపోయింది. తర్వాత అక్కడ ఎక్కువ కేసులు ఉండడంతో కేరళ బదులు తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ కు సిద్దమైయింది చిత్రబృందం.

చిరు లేకుండానే మొదలైనా ’వేదాళం’ రీమేక్..?

వామ్మో.. పుష్ప లో తోమ్మిది మంది విలన్స్ అంటా..?

పుష్ప స్పెషల్ సాంగ్ లో ఊర్వశి..!

మ‌రోసారి తెరపైకి శ్రీముఖి ల‌వ్ రిలేష‌న్ షిప్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -