Saturday, April 20, 2024
- Advertisement -

మన సెలబ్రిటీస్ లో ఎంత మంది డాక్టర్లు ఉన్నారో చూడండి..!

- Advertisement -

డాక్టర్ చదువు చదివి నటులు అయినవారు చాలా మందే ఉన్నారు. అందులో ప్రధానంగా హాస్య నటుడు డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియో పతి వైద్యంలో ఆరితేరారు. ఆయన పేరుతో రాజమండ్రిలో కాలేజీ కూడా ఉంది. ఈయన చిరంజీవికి స్వయాన పిల్లనిచ్చిన మామ. దాదాపుగా వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు. ఇక హీరో రాజశేఖర్ కూడా వైద్య వృత్తి చేస్తూ డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు.

ఆ తర్వాత సినిమాలపై ఇంట్రెస్ట్ తో వచ్చి యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నారు. నటి జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వారు కూడా హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. ఇక స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సౌందర్య కూడా ఎంబిబిఎస్ మధ్యలో ఆపేసి నటిగా కొనసాగింది. హీరోయిన్ గా మంచి స్థాయిలో ఉన్నప్పుడే విమాన ప్రమాదంలో మరణించింది. రంగం సినిమా లో సీఎం పాత్ర వేసి ,అద్భుతమైన విలనిజం పండించిన అజ్మల్ అమీర్ వైద్య శాస్త్రం చదివి, నటనతో పాటు ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు.

ఫిదా సినిమాతో అందర్ని ఫిదా చేసిన సాయి పల్లవి గుండె సంబంధిత వైద్య నిపుణురాలిగా పని చేస్తోంది. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంది. అదేవిధంగా లిటిల్ సోల్జర్స్ మూవీలో అల్లరి నటనతో ఆకట్టుకున్న కావ్య ఇప్పుడు డాక్టర్ చదివి ప్రాక్టీస్ చేస్తోంది. ఇక కరోనా కారణంగా ఓటిటిలో రిలీజైన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా చూసిన వాళ్లకు రూప కొడువయూర్ కళ్ళముందు మెదులుతుంది. సెకండాఫ్‌లో వచ్చే ఈ భామ స్వతాహాగా డాక్టర్ మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా. అలానే నటుడు భరత్ రెడ్డి అపోలో హాస్పిటల్లో కార్డియాలజీ స్పెషలిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు.

టాలీవుడ్ హీరోలు వారి పెళ్లికి ఎంత కట్నం తీసుకున్నారో తెలుసా ?

టాలీవుడ్ హీరోల ఆస్తుల విలువ ఎంతనో తెలుసా ?

మన తెలుగు హీరోయిన్స్ సొంత ఊరు ఎక్కడో తెలుసా ?

ఎన్టీఆర్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -