Friday, April 26, 2024
- Advertisement -

దేత్తడి హారిక గురించి మనకు తెలియని విషయాలు..!

- Advertisement -

బిగ్‌బాస్‌ ఇంట్లో ఎనర్జీగా గేమ్ ఆడుగుతుంది హారిక. హారిక గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం.

  • సెప్టెంబరు 4, 1997 న హైదరాబాద్‌లో ఓ మధ్యతరగతి కుటుంబంలో హారిక జన్మించింది. మెహదీపట్నంలోని సెయింట్‌ ఆన్స్‌ కాలేజీలో బీబీఏ పూర్తి చేసింది. ఆ తర్వాత అమెజాన్‌లో ఐటీ కన్సల్టెంట్‌గా ఉద్యోగం సంపాదించింది.
  • స్కూల్ డేస్ లో ఓ క్రష్ ఉండేదట. కానీ ఆ అబ్బాయి 8వ తరగతికి వచ్చేసరికి స్కూల్‌ మారిపోయాడు. దాంతో ఆ క్రష్ అలా ఉండిపోయింది.
  • జాబ్ చేస్తున్నప్పుడు ఏదైనా క్రియేటివ్‌గా చేద్దామని అనుకుంటూ ఉండేదట. ‘చిత్ర విచిత్రం’ అనే షార్ట్‌ ఫిలింతో నటన రంగంవైపు వచ్చిన హారిక ..,. ‘దేత్తడి’ వెబ్‌సిరీస్‌తో స్టార్‌ అయిపోయింది.
  • ‘దేత్తడి’ ఛానల్‌ నేమ్‌తో హారికకు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ ఛానల్‌కు 14 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
  • హారికకు సమయం దొరికినప్పుడల్లా ట్రావెలింగ్‌ చేస్తుంటుందట.
  • వెబ్‌ సిరీస్‌ల్లో ఆమె నటకు ఫిదా కాని నెటిజన్‌ లేడంటే అతిశయోక్తి కాదు. ఏపీ ప్రభుత్వం నుండి ‘బెస్ట్‌ యూట్యూబర్‌ అవార్డు’ను హారిక గెలుచుకుంది. అలాగే ‘బెస్ట్‌ కామెడీ కంటెంట్‌ క్రియేటర్‌’ పురస్కారం కూడా దక్కించుకుంది.
  • అర్జున్‌ రెడ్డి తమిళ వెర్షన్‌ ‘ఆదిత్య వర్మ’లో హారిక నటించింది. అందులో ఓ నర్స్‌గా కనిపించింది. ఆమెను వీడియోల్లో చూసి ఆ పాత్రకైతే బాగుంటుందని ఎంపిక చేశారట.
  • హారిక ఈ స్థాయికి చేరుకోవడానికి ఆమె తల్లి చాలా సపోర్టు చేశారు. ఆమె ఎంకరేంజ్‌మెంట్‌తోనే ఇప్పుడు బిగ్‌బాస్‌లో అడుగుపెట్టింది. హారికను ఇంట్లో జెర్రీ, బంగారు తల్లి అని ముద్దుగా పిలుస్తారు.
  • హీరోయిన్‌గానే చేయాలని లేదట. మంచి పాత్ర ఉండాలి. అది జనాల్లో గుర్తుండిపోవాలి అనేది నా ఆలోచన అని హారిక చెబుతోంది.
  • పూరి జగన్నాథ్‌ గారి ఆలోచనా విధానం అంటే బాగా ఇష్టపడుతుందట. ఆయన ఆలోచన థగ్‌ లైఫ్‌ అలా అనిపిస్తుందట.
  • ఇక పెళ్లి విషయానికొస్తే… నన్ను భరించేటోడుని పెళ్లి చేసుకుంటాను అని చెబుతుంటుంది హారిక.
  • హారికకు నిత్య మేనన్‌ అంటే చాలా ఇష్టంమట. అలాగే సమంత, ఇలియానా అన్నా ఇష్టపడుతుంది. ఇక దర్శకుల విషయానికొస్తే గౌతమ్‌ మేనన్‌, పూరి జగన్నాథ్‌, సుకుమార్‌ అంటే ఇష్టపడుతుంది. ఇక హీరోల్లో విజయ్‌ దేవరకొండ అంటే క్రష్‌. రానా, ధనుష్‌ అంటే ఇష్టపడుతుంది.

వెంకటేష్ కు ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా ?

వైజాగ్ కి మహర్దశ మొదలైందా..

35 ఏళ్లు దాటిన ఇంకా పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

సర్జరీతో అందం మార్చుకున్న హీరోయిన్స్ ఎవరో చూడండి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -