సీనియర్ హీరో గా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకొని ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన వారిలో ఛార్మి కౌర్ ఒకరు.అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ సినిమాలను నిర్మించే పనిలో పడ్డారు.క్రమంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి ‘పూరీ కనెక్ట్స్’ అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించి నిర్మాతగా మారారు.
ప్రస్తుతం పూరి కనెక్ట్ లో ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తూ విజయ్ దేవరకొండ హీరోగా”లైగర్” అనే పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ క్రమంలోనే లవ్లీ ప్రొడ్యూసర్ ఛార్మి పుట్టిన రోజు మే 17న కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేశారు.
Also read:ఈ సీరియల్స్ హీరోయిన్స్ అసలు వయసు ఎంతో తెలుసా?
ఈ క్రమంలోనే హీరో విజయ్ దేవరకొండ అందమైన ఫ్లవర్స్ తో అలంకరించిన బర్త్ డే గిఫ్ట్ తో పాటు,గూడీస్ ని పంపించిన విజయ్.. ‘హ్యాపీ బర్త్ డే ఛార్మి ఫుల్ లవ్’ అని గ్రీటింగ్ కార్డ్ మీద రాసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ విషయాన్ని ఛార్మి తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తెలుపుతూ.. “థాంక్స్ మై లైగర్ విజయ్ దేవరకొండ” అని పోస్ట్ పెట్టింది. ఇకపోతే విజయ్ దేవరకొండ పుట్టినరోజు కూడా ఇటీవల కాలంలోనే సెలబ్రేట్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
Also read:బుల్లితెరపై టాప్ 5 యాంకర్స్ వీళ్ళే!