పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ‘పెళ్లి చూపులు’ సినిమాలో హీరో గా నటించి మంచి మార్కులు కొట్టేసిన యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఫోన్ వెళ్లడం ఇప్పుడ చర్చనీయాంశం అయింది. విజయ్ దేవరకొండ ‘పెళ్లి చూపులు’ కంటే ముందు కొన్ని చిత్రాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ‘పెళ్లి చూపులు’ అనే చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.
పెళ్లి చూపులు మూవీలో మంచి పెర్ఫార్మెన్స్ కనబర్చడం, లుక్స్ పరంగా బావుండటంతో ఈ యువ హీరోకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. మెగా డాటర్ నిహారిక రెండో సినిమాలో కూడా విజయ్ దేవరకొండ హీరోగా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు పవర్ స్టార్ ఆఫీస్ నుండి విజయ్ దేవరకొండకు ఫోన్ రావడం హాట్ టాపిక్ అయింది.
పవన్ స్నేహితుడు, నిర్మాత శరత్ మరార్ విజయ్‌కు ఫోన్ చేసి అభినందించడంతో పాటు ఒకసారి కలుద్దామని, ఆఫీస్‌కు రమ్మని పిలినట్లు వార్తలు వినిపిస్తునప్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా శరత్ మరార్ నిర్మాణంలో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రకు విజయ్ ని తీసుకునే అవకాశం ఉందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. అందుకే పవన్ ఆఫిస్ నుంచి విజయ్ ఫోన్ వెళ్లిందని అంటున్నారు.
Related