Sunday, May 12, 2024
- Advertisement -

పవన్ కొత్త సినిమా ప్లాన్ ఇదే!

- Advertisement -

ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా షూట్ మొదలు కాబోతుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు పవన్ కొత్త సినిమా గురించి రోజుకో వార్త వస్తున్న విషయం తెలిసిందే. ఈ శనివారమే పవన్-డాలీల సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కాబోతోంది. తొలి షెడ్యూల్ హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారు పవన్.

అయితే ఈ షెడ్యూల్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోతుందట. ఇక ఈ షెడ్యూల్లో పవన్ పాల్గొనడం కూడా అనుమానమే అంటున్నారు. పవన్ మాత్రం ఈ నెలాఖర్లో వచ్చే షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది. ఈ రెండు రోజుల షూట్ తర్వాత వచ్చే నెల నుంచి నిర్విరామంగా షూటింగ్ జరగబోతుందట. ఈ ఏడాది ఆఖర్లోగా సినిమాని కంప్లీట్ చేయాలి అని పవన్ ఫిక్స్ అయ్యాడట.

ఇక ఈ చిత్రం కు డాలీ దర్శలత్వం వహిస్తుండగా పవన్ మిత్రుడు శరత్ మరారే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన ‘గబ్బర్ సింగ్’ కథానాయిక శ్రుతి హాసన్ మరోసారి పవన్ తో జోడీ కట్టబోతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు.

Related

  1. చిరు సినిమాకి పవన్ సలహాలు చెప్పాడట!
  2. పవన్ నిజంగానే కారును అమ్మేశాడా?
  3. పవన్ మళ్లీ ఆ తప్పే చేస్తున్నాడా?
  4. పవన్ బ‌ర్త్‌డే రోజు ఎన్టీఆర్ గిప్ట్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -