Wednesday, May 22, 2024
- Advertisement -

మెగా హీరోలకి అదిరిపోయే షాక్ ఇచ్చిన పవన్!

- Advertisement -

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతీ తెలిసిందే. వచ్చే నెల నుంచి ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరగనుంది. అయితే ఈ సినిమా కథ ప్రకారంలో ఇందులో ముగ్గురు యంగ్ హీరోలు కనిపించాల‌ట‌. అందుకోసం మెగా హీరోల‌ను ఎంపిక చేస్తే బాగుంటుంద‌ని డాలీ చెప్పాడ‌ట‌. అయితే పవన్ మాత్రం త‌న ఫ్యామిలీ హీరోల‌తో  గెస్ట్ రోల్ చేయించే విష‌యాన్ని తిర‌స్క‌రించిన‌ట్టు తెలుస్తోంది.

ఫ్యామిలీ నుంచి కాకుండా ఇతర యంగ్ హీరోలని ఎంపిక చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో డైరెక్టర్ డాలీ ఆపాత్రలకి తగ్గ యంగ్ హీరోల అన్వేషణలో ఉన్నాడ‌ట‌. మెగా యంగ్ హీరోలు రామ్ చరణ్,సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లకు పవర్ స్టార్ అంటే చాలా ఇష్టం. అయితే ఎంతో క్రేజ్ ఉన్న ఈ ముగ్గురు హీరోల‌ను సైతం ప‌వ‌న్ కాద‌నుకోవ‌డం విశేషం.

ఇక ఆ మూడు పాత్ర కోసం శర్వనంద్, నాగశౌర్య, ఇటివలే పెళ్లి చూపులు అనే చిన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ ని తీసుకోవాలి అని చూస్తున్నారట. కాకపోతే దీనిపై ఇంకా అధికరికంగా ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రానుంది.

Related

  1. ఇండైరెక్ట్ గా సహాయం చేసిన పవర్ స్టార్!
  2. మరోసారి గట్టి పోటికి పవర్ స్టార్!
  3. పవర్ స్టార్ ఫ్యాన్స్ vs స్టైలీష్ స్టార్ ఫ్యాన్స్
  4. ఎన్టీఆర్ కి థాంక్స్ చెప్పిన పవర్ స్టార్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -