టాలీవుడ్ సంచలన హీరో విజయ్ దేవరకొండ పరిస్థితి మరి దారుణంగా తయ్యారైంది.పెళ్లి చూపులు,అర్జున్ రెడ్డి,గీతా గోవిందం సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన విజయ్ ఒక్కసారిగా స్టార్ హీరోగా మారాడు.కాని నోటా సినిమా విజయ్ దేవరకొండ అభిమానులను బాగా నిరాశకు గురి చేసింది.ఆయన నటించిన ‘టాక్సీవాలా’ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా హిట్ అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఫ్లాప్ అని అంటున్నారు. ఇదెలా అంటారా..? కొన్ని రోజుల క్రితం ఈ సినిమా మొత్తం ఎడిట్ చేయని వెర్షన్ అంటే దాదాపు 3 గంటల సినిమా లీక్ అయిపోయింది. దీంతో ఈ సినిమాని చాలా మంది ముందే చూసేసి ఇప్పుడు రిజల్ట్ కూడా చెప్పేస్తున్నారు.
రీసెంట్ గా సినిమా ఫస్ట్ సాంగ్ విడుదల చేసే సమయంలో కొంత ఆలస్యమయిందని ఆ పాటకి సంబంధించిన స్క్రీన్ షాట్ లను సోషల్ మీడియాలో పెట్టడం మొదలుపెట్టారు. దాన్ని బట్టి సినిమా ఎంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయిందో అర్ధమవుతోంది. అయితే విజయ్ దేవరకొండ మాత్రం తన సినిమాకి ప్రచారం చేయడం మాత్రం మానడం లేదు. తన సరికొత్త స్ట్రాటజీలతో సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ‘టాక్సీవాలా’ పై సోషల్ మీడియాలో సెటైర్లు వేయడంతో విజయ్ దేవరకొండ పరిస్థితి ఇలా అయిందేంటి అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ పైరసీని దాటి ‘టాక్సీవాలా’ హిట్ టాక్ తో బయటపడుతుందో లేదో చూడాలి.