Monday, April 29, 2024
- Advertisement -

ఇన్నాళ్ల కెరీర్ లో స్టైలిష్ స్టార్ మిస్ చేసుకున్న సినిమాలు ఏవో తెలుసా?

- Advertisement -

టాలీవుడ్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో “గంగోత్రి” సినిమా ద్వారా హీరోగా అరంగేట్రం చేశారు. అల్లు అర్జున్ నటించిన మొదటి సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మొదటి సినిమానే విజయవంతం కావడంతో అల్లుఅర్జున్ కు వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే విభిన్నమైన కథలను, ప్రేమ కథలను ఎంచుకుని ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించారు.

అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 18 సంవత్సరాలు అయినప్పటికీ 20 చిత్రాలకు పైగానే నటించారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తన కెరియర్ లో సుమారు 13 సినిమాలకు పైగానే రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని సినిమాలు కథ నచ్చక వదిలేస్తే మరికొన్ని సినిమాలకు అప్పుడున్న పరిస్థితుల కారణంగా నో చెప్పాల్సి వచ్చింది.మరి అల్లు అర్జున్ తన కెరియర్ లో వదులుకున్న బ్లాక్ బస్టర్, డిజాస్టర్ సినిమాలు ఏమిటో ఓ లుక్కేద్దాం…

Also read:వీలైనంత వరకు మాంసం తగ్గించండి అంటున్న.. స్టార్ హీరోయిన్?

అల్లుఅర్జున్ వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు… జయం, గీతా గోవిందం, అర్జున్ రెడ్డి, బొమ్మరిల్లు, భద్ర.బన్నీ వదులుకున్న సూపర్ హిట్ సినిమాలు…100% లవ్, పండగ చేస్కో. ఇక అల్లు అర్జున్ కెరీర్లో వదులుకున్న డిజాస్టర్ సినిమాలు… డిస్కో రాజా, జాను, కృష్ణాష్టమి, గ్యాంగ్ లీడర్.ఈ సినిమాలో అన్నింటిని అల్లు అర్జున్ తన కెరీర్లో కొన్ని కారణాల వల్ల వదులుకున్నారు.

Also read:మన్మధుడు హీరోయిన్ ఇప్పుడు ఎక్కడుంది ఏం చేస్తుందో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -