Friday, April 19, 2024
- Advertisement -

పవన్ కు కథ వినిపించడంపై విజయేంద్ర ప్రసాద్​ క్లారిటీ..!

- Advertisement -

బాహుబలి సినిమా హిట్​ కావడంతో విజయేంద్ర ప్రసాద్​ రేంజ్​ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆయన కథ కోసం .. అన్ని భాషల నటులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలు బాలీవుడ్​ సినిమాలకు సైతం విజయేంద్ర ప్రసాద్​ కథలు అందించాడు. అయితే విజయేంద్రప్రసాద్​ పవన్​ కల్యాణ్​ సినిమాకు కథ అందించబోతున్నాడని.. ఈ మేరకు పవర్​ స్టార్​తో చర్చలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. పవర్​ స్టార్​తో విజయేంద్ర ప్రసాద్​ స్టోరీ డిస్కషన్​లో కూడా పాల్గొన్నాడని గుసగుసలు వినిపించాయి.

అయితే ఈ విషయంపై విజయేంద్రప్రసాద్​ స్పందించాడు. ‘ పవన్​ కల్యాణ్​ సినిమాకు కథ అందించడం అదృష్టంగా భావిస్తాను. కానీ నాకు ఇప్పటివరకు ఆ చాన్స్​ రాలేదు. నన్ను ఎవరూ సంప్రదించలేదు. అవకాశం వస్తే కచ్చితంగా కథ అందిస్తాను’ అంటూ ఆయన క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో పవన్​ కల్యాణ్​కు విజయేంద్ర ప్రసాద్​ కథ ఇవ్వడం లేదు అన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది.

Also Read: ఎయిర్​పోర్ట్​ ఇలా ఉంటే దేశం పరువు పోదా? డైరెక్టర్ రాజమౌళి ట్వీట్ ..!

ఇక రాజకీయాలకు తాత్కాలికంగా బ్రేక్​ ఇచ్చిన పవన్​ కల్యాణ్ సినిమాల్లో బిజీ అయ్యాడు. ఆయన నటించిన వకీల్​ సాబ్​ చిత్రం సూపర్​ హిట్ అయ్యింది. తర్వాత క్రిష్​తో హరిహర వీరమల్లు అనే చారిత్రక చిత్రంలో నటిస్తున్నాడు. ఆ తర్వాత మరో మలయాళ చిత్రం అయ్యప్పమన్​ కోషియమ్​ రీమేక్​లోనూ పవన్​ కల్యాణ్ నటిస్తున్నాడు. ఇలా వరస పవన్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు.

Also Read: ఏ హీరోలకు తగ్గేదేలా.. బన్నీ నుంచి మరో పాన్ ఇండియా మూవీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -