Wednesday, May 1, 2024
- Advertisement -

‘మేజర్’ మార్కెట్​ మామూలుగా లేదుగా..​

- Advertisement -

అడవి శేషు సినిమాలంటేనే యువతలో ప్రత్యేక క్రేజ్​ ఉంటుంది. విభిన్నమైన కథ, కథనం ఎంచుకోవడం అడవి శేషు స్టయిల్​. ప్రస్తుతం ప్రేక్షకులు కూడా విభిన్న తరహా చిత్రాలను, థ్రిల్లర్​ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో అడవి శేష్​కు ప్రత్యేకంగా ఫ్యాన్స్​ ఏర్పడ్డారు. మాస్​ కంటే క్లాస్​ జనాల్లో అతడికి ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. అడవి శేషు నటించిన క్షణం, గూడచారి, ఎవరు వంటి చిత్రాలు మంచి సక్సెస్​ అందుకున్నాయి. ఈ క్రమంలో మరో విభిన్న చిత్రంలో నటిస్తున్నాడు అడవి శేష్​.

తొలిసారిగా ఓ బయోపిక్​లో నటిస్తున్నాడు. 26/11 ముంబై ఉగ్రదాడిలో ఉగ్రవాదులను పట్టుకొనేందుకు, వారిని మట్టు బెట్టేందుకు కీలక పాత్ర పోషించిన మేజర్​ సందీప్​ ఉన్ని కృష్ణణ్​ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. సినిమాకు అడివి శేష్ స్క్రిప్ట్ మరియు స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. గూడచారి చిత్రానికి దర్శకత్వం వహించిన ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ మూవీని తెరకెక్కుస్తున్నాడు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read: నా బయోపిక్​ తీస్తే అతడే హీరో.. రైనా

GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తుంది. అయితే మేజర్​ సినిమా హిందీ శాటిలైట్​ హక్కులు రూ. 10 కోట్లకు అమ్ముడు పోయినట్టు సమాచారం. నిజానికి జూలై 2న ఈ మూవీని విడుదల చేయాలని భావించారు. కానీ కరోనా ఎఫెక్ట్​తో వెనక్కి తగ్గారు. అయితే ఈ చిత్రం టీజర్​కు భారీ రెస్పాన్స్​ వచ్చింది. దీంతో ఆ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read: ఇంగ్లీష్​లో డబ్​ అయిన తొలి తెలుగు సినిమా ఏంటో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -