Friday, April 19, 2024
- Advertisement -

కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న కేజీఎఫ్-2

- Advertisement -

పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ ఛాప్టర్ 2 రికార్డుల దిశగా దూసుకుపోతోంది. తొలి మూడు రోజుల్లో 3 వందల కోట్లూ వసూలు చేసిన ఈ మూవీ నాలుగో రోజూ అదే జోరు కొనసాగించింది. ఒక్క రోజే వంద కోట్లు దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదలైన కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా అంచనాల మేరకు రాణిస్తూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్ అయితే తొలి మూడ్రోజుల్లో వందకోట్లు వసూలు చేసింది. ఓవరాల్‌గా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్స్ 3 వందల కోట్లు.

తెలుగు రాష్ట్రాలలో నాలుగో రోజు మార్నింగ్ బుకింగ్స్ 20 శాతం తగ్గినా.. సాయంత్రం షోల బుకింగ్స్ భారీగా ఊపందుకున్నాయి. దీంతో కేజీఎఫ్ 2 తెలుగు వెర్షన్ నాలుగో రోజు 8 కోట్లు షేర్ సొంతం చేసుకుంది. కర్ణాటకలో నాలుగో రోజు కలెక్షన్స్ 18 కోట్లు కాగా.. మలయాళం బాక్సాఫీసు దగ్గర 7 కోట్ల మేర వసూలు చేసింది. ఇక తమిళనాడులో కూడా నాలుగో రోజు దాదాపు 7 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోయింది.

దూకుడు మీదున్న కేజీఎఫ్ హిందీ వెర్షన్.. నాలుగో రోజే దాదాపు 40 నుంచి 45 కోట్లు వరకు కలెక్షన్లు సొంతం చేసుకుందని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కేజీఎఫ్-2 … 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 92 కోట్ల నుండి 95 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు అంచనాలున్నాయి. ఓవర్సీస్‌లో మరో వంద కోట్ల కలెక్షన్ల దక్కించుకున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా ఈ సినిమా ఎన్ని కోట్లు దక్కించుకుంటుందోనని సినీ పండితులు లెక్కలు కడుతున్నారు.

మళ్లీ తెరపై చిరు విశ్వరూపం

సమంతకు షాక్ ఇచ్చిన దర్శకుడు

పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ కు ఎంత డిమాండ్ చేస్తుందంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -