Saturday, April 27, 2024
- Advertisement -

విలన్ ను పెళ్లాడబోతున్న హీరోయిన్

- Advertisement -

అందాల నటి విలన్ తో ప్రేమలో పడింది. సినిమాలో కాదులెండి. నిజజీవితంలోనే..మోడల్ గా కెరీరీ ప్రారంభించి నటిగా మారిన అందాల భామ విమలా రామన్. మలయాళంలో నటిగా అరంగేట్రం చేసిన విమలా రామన్.. తెలుగులోనూ నటించింది. ‘గాయం-2’, ‘చట్టం’, ‘ఎవరైనా.. ఎపుడైనా’ తదితర చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. తమిళ నటుడు వినయ్ రాయ్ ను ఆమె పెళ్లాడబోతోందంటూ కోలీవుడ్ కోడై కూస్తోంది.

ప్రస్తుతం వీరిద్దరు డీప్ లవ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్నారు. చాలా సార్లు మీడియా కంటకూడా పడ్డారు. మాల్దీవుల్లో హాలీడేను ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలోనూ చాలా సార్లు పంచుకున్నారు.

ఇప్పుడు తమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటిస్తారని వారికి సన్నిహితంగా ఉండేవారు చెబుతున్నారు. వినయ్ ‘డిటెక్టివ్’, ‘చంద్రకళ’, ‘వరుణ్ డాక్టర్’ తదితర సినిమాల్లో విలన్‌గా నటించాడు.

చైతూ, సామ్ కలిపేందుకు నందినిరెడ్డి ప్రయత్నాలు..?

సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న సోనాలి

రాశీఖన్నా షాకింగ్ కామెంట్స్… వారి మెప్పుకోసమేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -