Thursday, May 2, 2024
- Advertisement -

కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్

- Advertisement -

హైదరాబాద్ పబ్‌లో డ్రగ్స్ వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీస్తోంది. అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి తెర తీసింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో వాతావరణం వేడెక్కింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేసీఆర్‌ను సవాల్ చేయడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపణలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పిల్లలను అడ్డు పెట్టుకుని శిఖండి రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తన కుటుంబం, బంధువుల్లో ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నారన్న అనుమానాలుంటే… తానే వెంటపెట్టుకుని వచ్చి టెస్ట్‌లు చేయిస్తానన్నారు. తన మేనల్లుడని చెబుతున్న ప్రణయ్ రెడ్డితో శాంపిల్స్ ఇప్పిస్తానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే.. తన కుమారుడు కేటీఆర్‌ను డ్రగ్స్ పరీక్షలకు పంపించాలని సవాల్ విసిరారు.

తెలంగాణ రాష్ట్రాన్ని మరో పంజాబ్‌లా కేసీఆర్ ప్రభుత్వం మారుస్తోందని పీసీసీ చీఫ్‌ విమర్శించారు. పంజాబ్‌లో డ్రగ్స్‌కు బానిసై యువత నిర్వీర్యమయ్యారన్నీ.. ఇక్కడ కూడా అదే పరిస్థితి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఫుడ్ అండ్ మింక్‌ పబ్‌లో 142 మంది యువతీ యువకులు పట్టుబడితే… వారందరికీ డ్రగ్స్ పరీక్షలు చేయకుండా ఎందుకు విడిచిపెట్టారని ప్రశ్నించారు. మంత్రి కేటీఆరే స్వయంగా పోలీస్ అధికారికి ఫోన్ చేసి చూసీ చూడనట్లు వదిలేయాలని చెప్పారని ఆరోపించారు. దీన్నిబట్టి వారికి కావాల్సిన వారు ఎవరో అందులో ఉన్నారన్నారు. తన మేనల్లుడు ప్రణయ్ రెడ్డి పట్టుబడినట్లు చెబుతున్నారని… అతన్ని విడిచిపెట్టమని తాను గానీ తన కుటుంబ సభ్యులు గానీ పోలీసులపైనో, ప్రభుత్వంపైనో ఒత్తిడి ఏమైనా తెచ్చామా అని ప్రశ్నించారు. అతడి పరీక్షలు చేయకుండా తామేమైనా అడ్డుపడ్డామా అని రేవంత్ నిలదీశారు.

అందరి నుంచి నమూనాలు సేకరించి నిజాలు నిగ్గు తేల్చాల్సింది పోయి అందుకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు. డ్రగ్స్ వ్యవహారానికి వ్యతిరేకంగా తాను మొదటి నుంచి పోరాడుతున్నానని రేవంత్ గుర్తు చేశారు. టాలీవుడ్ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి మొత్తం సమాచారాన్ని ఈడీకి ఇవ్వాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించినా స్పందన లేదన్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారం బయటపడినప్పటి నుంచే కేటీఆర్‌కు ఇండస్ట్రీపై పట్టు పెరిగిందన్నారు. దాన్ని అడ్డుపెట్టుకుని సినీ పరిశ్రమను తన అదుపులో పెట్టుకున్నారని ఆరోపించారు.

ఏపీ సీఎం ఢిల్లీ టూర్ ఆంతర్యం ఏంటి ?

రాజకీయాల్లోకి యంగ్ టైగర్ వస్తున్నారా ?

మరోసారి సెంటిమెంట్ ఫాలోఅవుతున్న త్రివిక్రమ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -