సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న సోనాలి

- Advertisement -

అలనాటి టాలీవుడ్ టాప్ హీరోయిన్ సోనాలీ బింద్రే..సినిమాల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. 2001లో మురారీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ.. తొలి చిత్రంతోనే అభిమానుల మనసు దోచుకుంది. ఇంద్ర, మన్మథుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సూపర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది. తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడిన సోనాలి బింద్రే.. దాన్ని జయించింది.

ఇప్పుడు దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ -కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఇందులో ఓ కీలక పాత్ర కోసం సోనాలీని మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. ఇందులో నటించేందుకు అటు సోనాలీ బింద్రే కూడా పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

- Advertisement -

ఈ సినిమాకు సుధాకర్‌ మిక్కిలినేని నిర్మతగా వ్యవహరించనున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, నందమూరి కల్యాణ్‌రామ్‌ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. ఉప్పెన్ దర్శకుడు బుచ్చిబాబుతో ఎన్టీఆర్ త్వరలో ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం. దీనిపై వచ్చే నెల 11న ప్రకటన వెలువడే అవకాశం ఉంది. క్రీడా నేపథ్యంలో ఆ సినిమా సాగనున్నట్లు సమాచారం.

స్టార్ యాంకర్ సుమ షాకింగ్ రెమ్యూనరేషన్

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధ‌మ‌వుతున్న ఆలియా భ‌ట్

టాలీవుడ్ హీరోల గురించి బయటపెట్టిన పూనమ్.. ఎవరు ఎలాంటి వారంటే ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -