- Advertisement -
ప్రముఖ మలయాళ గాయకుడు బాలభాస్కర్ మంగళవారం నాడు మృతి చెందారు.సెప్టెంబర్ 25న కుటుంబంతో సహా దైవ దర్శనానికి వెళ్లి తిరిగొస్తూ తిరువనంతపురం శివార్లలో జరిగిన ప్రమాదంలో గాయకుడు బాలభాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయన వారం రోజులుగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఓ ఆలయాన్ని దర్శించుకోవడానికి భార్య లక్ష్మీ, కుమార్తె తేజస్విలతో సహా బాలభాస్కర్ వెళ్లారు.
దర్శనం పూర్తి చేసుకొని ఇంటికి వస్తోన్న క్రమంలో వారు ప్రయాణిస్తోన్న వాహనం అదుపుతప్పి, రహదారిపై ఉన్న ఓ చెట్టుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలభాస్కర్ కుమార్తె తేజస్వి(2) అక్కడికక్కడే మరణించింది. బాలభాస్కర్ మృతి పట్ల మలయాళ చిత్రపరిశ్రమ సంతాపం తెలుపుతున్నారు.