Friday, March 29, 2024
- Advertisement -

యూట్యూబ్ స్టార్.. క‌మెడీయ‌న్ వైవ హర్ష నిశ్చితార్థం!

- Advertisement -

యూట్యూబ్‌ స్టార్‌, కమెడియన్‌ వైవా హర్ష నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ మేరకు తన నిశ్చితార్ధ ఫొటోలను హర్ష సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. వీరి నిశ్చితార్థ వేడుక‌కు కేవ‌లం కుటుంబ స‌భ్యులు, సన్నిహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. వేడుక‌కు సంబంధించిన ఫొటోల‌ని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌గా, ఇవి వైర‌ల్ అయ్యాయి.

ఓ ఫొటోకు  ‘చివరి బ్యాచిలర్‌ సెల్ఫీ’ అని క్యాప్షన్‌ రాసుకొచ్చారు హ‌ర్ష. కాగా తన పెళ్లి డేట్‌ మాత్రం ఇంకా ప్రకటించలేదు. యూట్యూబ్‌ ద్వారా ఫేమస్‌ అయిన వైవా హర్ష నెటిజన్లకు బాగా దగ్గరయ్యాడు. సోషల్‌ మీడియా ద్వారా కూడా సినిమాల్లో ఛాన్సులు అందుకోవచ్చని నిరూపించిన వారిలో వైవా హర్ష ఒకరు. వైవా సిరీస్ హర్షకు ఎంతో పెరుతీసుకొచ్చింది.

అంతేకాకుండా హర్ష ప్రస్తుతం ఆహాలో తమాషా విత్ హర్ష అనే టాక్ షోకు హోస్ట్‌గా కూడా పని చేస్తున్నాడు. పలువురు ప్రముఖులు, యూట్యూబ్‌ స్టార్స్‌, సోషల్‌ మీడియా స్టార్స్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప‌లు సినిమా ఆఫ‌ర్స్ కూడా అందుకున్న హ‌ర్ష చివ‌రిగా క‌ల‌ర్ ఫొటో అనే సినిమా చేశాడు. ఇందులో త‌న కామెడీతో ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ  న‌వ్వించాడు.

శ్రీదేవి భర్త ఇప్పుడు ఆ పనిచేయబోతున్నారట?

కేవలం వారం రోజుల్లో లఖ్వీని కి శిక్ష ఖరారు..!

పాక్ హిందూ గుడి కేసులో మళ్ళీ 55 మంది అరెస్ట్..!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -