అంగరంగ వైభవంగా సింగర్ సునిత వివాహం!

- Advertisement -

ప్రముఖ గాయని సునీత-డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ డిజిటల్ మీడియా అధినేత మాంగో రామ్ సునిత మెడలో మూడు ముళ్ళు వేశారు. హైదరాబాద్ శివారు శంషాబాద్ లోని అమ్మపల్లి దేవాలయంలో వీరి వివాహం జరిగింది. ఆలయ ప్రాంగణంలో  అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని అంగరంగవైభవంగా ముస్తాబు చేసారు.

సునీత పెళ్లికి పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఘనంగా సింగర్‌ సునీత వివాహం
- Advertisement -

ఇటీవలే పెళ్లి చేసుకున్న హీరో నితిన్ దంపతులకు కూడా మంత్రి దయాకర్ రావు ఈ సందర్భంగా ఆశీస్సులు అందించారు. ప్రస్తుతం సునిత వివాహ వేడుకకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సునీత ఇద్దరు పిల్లలే ఆమెకు దగ్గరుండి వివాహం జరిపించడం విశేషం.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...