టాలీవుడ్ కు ఈఏడాది బాహుబలి-2తోను, ఖైదీ నెంబర్ 150తోను పొద్దు గడిచిపోయింది. ఈ రెండు సినిమలు లెక్కలేనంత బిజ్ ను క్రియేట్ చేశాయి. ఇక ఎటొచ్చి మిగిలింది… అధ్బుతాలు సృష్టించాల్సింది..వచ్చే ఏడాది మన టాప్ హీరోలే. అందుల్లో కూడా చిరంజీవి సైరా నరసింహా రెడ్డితో నేనున్నా అంటూ వందకోట్ల పై బడ్జెట్ తో మిగతా బాబులను బెదరగొడుతున్నాడు. సాహో సైతం ఇదే రేంజ్ లో మీదమీదకు వస్తుంది. ఇక వీరిద్దరికి ముకుతాడు వేయలని మరికొందరు ఉత్సుకత చూపిస్తున్నారు.
వారిలో భరత్ అను నేనుతో మహేష్ మెరుపులు మెరిపిస్తుంటే… అజ్ఞాతవాసిగా పవర్ స్టార్ పాంచ్ పటాకా ఆడాలనుకుంటున్నాడు. నా పేరు సూర్యతో బన్నీ కూడా నేనేం తక్కువ తినలేదనే చెబుతున్నాడు. తారక్ ,త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చే సినిమా కూడా వందకోట్ల రేసులో ఉంది. రంగస్థలం 1985 చిత్రంతో చెర్రీ బాబు కూడా రేసుగుర్రమై పరిగెత్తుతానంటున్నాడు. మన తమ్మారెడ్డి భరద్వాజ చెప్పినట్లు… వచ్చే ఏడాది మన సినిమాలు వందకోట్లను క్రాస్ చేసేవి చాలా వస్తాయన్నట్లుగా భవిష్యత్ నిజంగా ఆశాజనకంగానే కనిపిస్తుంది. కాని అంతా అనుకుంటున్నట్లు ఎవరో ఒక హీరోనే మొత్తం వచ్చే ఏడాదిని లీడ్ చేస్తాడని చెప్పడానికి లేదు.దానికి కారణం…ప్రతి చిత్రమూ ఓ విభిన్నమైనదే .ఎవరు మైలురాయి వారిది. ఇక్కడ మొనగాడు అని చెపుకోవడానికి లేదు. ఎందుకంటే ఏ చిత్రం విజయం సాధించినా ఆయా యాంగిల్లో ఆయా సినిమాలకు వారే మగాళ్లవుతారనే విషయం స్పష్టమైపోయింది.