ఫాలోవర్స్‌పై బిగ్ బీ ఆగ్రహం
తన కన్నా ఎక్కువ మంది ఫాలోవర్స్ వేరే హీరోకు ఉండడంతో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కొంత ఆందోళనలో ఉన్నారు. దీనిపై తన ఫాలోవర్స్ వ్యంగ్యం మాట్లాడుతూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే వీటికి తోడు బిగ్ బీ పలువురు నటీనటులను కొత్తగా ఫాలో అవడం ప్రారంభించారు. వారిలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నారు. వీటన్నిటిపై ఫాలోవర్స్ తన ఫాలోవర్స్ తగ్గుతుండడంతో బిగ్ బీ బాధలో ఉన్నారని.. అందుకే వేరే హీరోలను, ప్రముఖులను ఫాలో అవడం ప్రారంభించారని వ్యంగ్యంగా అంటున్నారు.
వీటన్నిటిని చూసిన అమితాబ్ అది నా ట్విట్టర్ నా ఇష్టం.. మీకేంటి అని ప్రశ్నించారు.‘అవును..నేను ట్విటర్‌లో చాలా మందిని ఫాలో అవుతున్నాను. నా ఇష్టానుసారంగానే ఇలా చేస్తున్నాను. చాలా మంది నా ఖాతా హ్యాకైందేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. అందులో ఏ మాత్రం నిజం లేదు. ఇతరులను అనుసరించడం తప్పా? అదే అయితే ఈ ట్విటర్‌లోనే లక్ష తప్పులు చేస్తా’ అంటూ అమితాబ్ ట్వీట్‌లో తెలిపారు.ఇలా ఆగ్రహం వ్యక్తం చేసిన అమితాబ్ ఇంతకు ముందెన్నడూ చేయలేదు. ప్రస్తుతం అమితాబ్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘బ్రహ్మాస్త్రా’, ‘102 నాటౌట్’, ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.