Friday, May 17, 2024
- Advertisement -

‘బాహుబలి’ ఆస్కార్ రేసుకు.. గెలిచి నిలుస్తుందా?!

- Advertisement -

ఇప్పటికే ఇండియా నుంచి ఆస్కార్ అవార్డులకు సినిమాలను పంపడానికి ఒక కమిటీ ఏర్పడింది.

అమోల్ పాలేకర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ సినిమాలను చూసి సెలెక్ట్ చేయాల్సింది. ఆస్కార్ అవార్డుల్లో భాగంగా విదేశీ చిత్రం క్యాటగిరీలో ఇచ్చే అవార్డు కోసం పోటీలో నిలవడానికి ఒక భారతీయ సినిమాను అవార్డుల కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ కమిటికీ ఆయా భాషల వారు పంపించిన సినిమాలను చూసి వాటిలో ఒకదాన్ని ఎంపిక చేస్తుంది. అంటే ఇది దేశీయంగా జరిగే రేసు అనమాట. ఈ రేసులో విజయవంతం అయిన సినిమా భారతదేశం తరపున అఫిషియల్ గా బరిలోకి దిగుతుంది.

ఇలాంటి నేపథ్యంలో ఇందు కోసం కూడా పోటీ తీవ్రంగానే ఉంది. తమిళం నుంచి కాకాముట్టై, హిందీ నుంచి పీకే, మసాన్  వంటి సినిమాలు ఇండియా నుంచి ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నాయి. వీటితో పోటీ పడుతోంది బాహుబలి. ఈ సినిమాల్లో ఏది ఉత్తమైనదని భావిస్తే కమిటీ ఆ సినిమాను భారత దేశం తరపున ఆస్కార్స్ కు పంపుతుంది. మరి బాహుబలికి ఆ అవకాశం దక్కుతుందా? లేక మసాన్ వంటి సినిమా దాన్ని సొంతం చేసుకొంటుందా? అనే సందేహాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. 

అలాగే తమిళ సినిమా కాకాముట్లై కూడా విమర్శకుల ప్రశంసలు పొందింది. పీకేకి దక్కిన ప్రశంసలు ఏమీ తక్కువ కాదు. మరి ఇప్పుడు ఈ రేసులో వీటిలో ఏది విజేతగా నిలుస్తుందో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -