Thursday, May 2, 2024
- Advertisement -

అల్లు అర్జున్‌కు కారావాన్ కి ప్రమాదం..!

- Advertisement -

అల్లు అర్జున్‌కు వాహనానికి తృటిలో ప్ర‌మాదం తప్పింది. పుష్ప సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా, ఆయన కారవాన్‌ను లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఖమ్మం రూరల్ సత్యనారాయణపురం వద్ద ఈ ఘటన జరిగింది. ఆ కారవాన్ మీద అల్లు అర్జున్ లోగో ఉండడంతో ఆ వాహ‌నం ఆయ‌న‌దిగా గుర్తించారు.

అదృష్ట వశాత్తు ఆ కారవాన్ లో అల్లు అర్జున్ లేనట్టు సమాచారం. రంపచోడవరం అడవుల్లో పుష్ప సినిమా షూటింగ్‌ను ఈ రోజే ముగించుకుని తిరుగు ప్రయాణమైన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న పుష్ప సినిమా షూటింగ్ ప్రస్తుతం ఏపీలోని రంపచోడవరం, మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో జరుగుతోంది.

పంచాయితీరాజ్ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత : డీజీపీ గౌతమ్ సవాంగ్

జగన్ మంత్రికి.. నిమ్మగడ్డ షాక్.. మంత్రిని ఇంట్లో పెట్టండి..!

నితిన్ వెనక్కి తగ్గడంతో నరేష్ సేఫ్ అయ్యాడు…!!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -