Saturday, May 4, 2024
- Advertisement -

పంచాయితీరాజ్ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత : డీజీపీ గౌతమ్ సవాంగ్

- Advertisement -

ఏపిలో గత కొన్ని రోజులుగా హై టెన్షన్ రేపుతుంది పంచాయితీరాజ్ ఎన్నికలు. కరోనా నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించరాదని ప్రభుత్వ అంటుంటే.. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు జరిపించాల్సిందే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్. మొత్తానికి ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ పడటం.. నామినేషన్ల పర్వం కొనసాగడం జరుగుతుంది.

తాజాగా పంచాయతీ ఎన్నికలకు పూర్తి భద్రత ఏర్పాటు చేసినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు.. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఫ్యాక్షన్‌ గ్రామాల్లో పోలీసు పికెటింగ్‌, మద్యం, నగదు తరలింపుపై తనిఖీలు చేపడతామన్నారు. ఎలాంటి ఘటన జరిగినా.. తక్షణమే స్పందించేలా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు.

మరోవైపు చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలపై పెద్దిరెడ్డి వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తాయని భావించిన ఎస్ఈసీ.. ఈనెల 21 వరకు మంత్రి పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు మంత్రి పెద్దిరెడ్డిని మీడియాతో మాట్లాడనివ్వొద్దని ఎస్‌ఈసీ ఆదేశించింది.

జగన్ మంత్రికి.. నిమ్మగడ్డ షాక్.. మంత్రిని ఇంట్లో పెట్టండి..!

నువ్వు రద్దు చేయడమేంటయ్యా నిమ్ము!

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పదవికి రాజీనామా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -