దేశంలో రోజు రోజుకీ రాజకీయ నాయకులపై దాడులు ఎక్కువ అవుతున్నాయి. మధ్య ప్రదేశ్‌లోని ఛతార్పూర్ జిల్లాలో స్థానిక కాంగ్రెస్ నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు ఆయనపై కాల్పులు జరిపి పారిపోయారు. అందరూ చూస్తుండగానే ఆయనపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు గుర్తించారు.
తాజాగా బెంగాల్ లోని ఉత్తర 24 పరగణాలు జిల్లా భట్పారాలోని బిజేపి ఎంపీ అర్జున్ సింగ్ ఇంటి వద్ద బాంబు దాడి జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు, ఆర్ఏఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
ఘటనకు పాల్పడిన వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అర్జున్ సింగ్ హెచ్చరించారు. దుండగులు మొత్తం 15 చోట్ల దాడులు జరిపారని, పోలీసులు ఏర్పాటు చేసిన సీసీటీవీలను కూడా ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో ఆ అభ్యర్థి ముందంజ..!