Sunday, May 5, 2024
- Advertisement -

‘సారంగ దరియా’ పాట వివాదానికి గుడ్ బాయ్ చెప్పేశారు!

- Advertisement -

ఒక్క పాట ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నెన్సేషన్ సృష్టిస్తుంది. అది యూట్యూబ్ లోనే కాదు వివాదాల్లో కూడా.. అవును సారంగ దరియా పాట తనదే అంటూ రిలీజ్ అయినప్పటి నుంచి తెరపైకి వచ్చింది జానపద సింగర్ కోమలి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘లవ్ స్టోరీ’ చిత్రంలో ‘సారంగ దరియా’ పాట ఎంత హిట్టయ్యిందో, అదే స్థాయిలో వివాదానికి కారణమైంది. ‘సారంగ దరియా’ పాట పల్లవులను తీసుకుని ‘లవ్ స్టోరీ’ సినిమాలో సుద్దాల అశోక్ తేజతో రాయించారు.

అయితే ఆ పాట ద్వారా తనకు ఎలాంటి ప్రయోజనం దక్కకపోవడం పట్ల కోమలి అసంతృప్తికి లోనైనట్టు వార్తలు వచ్చాయి. తనతో పాడించలేదని ఆమె ఆగ్రహం చెందినట్టు ప్రచారం జరిగింది. పలు టీవీ చానళ్లలో దీనిపై చర్చా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. తాజాాగా ఈ పాటకు సంబంధించిన వివాదం సమసిపోయిందని, తమ మధ్య ఎంతమాత్రం భేదాభిప్రాయాలు లేవని దర్శకుడు శేఖర్ కమ్ముల, గాయని కోమలి సంయుక్తంగా ఓ ప్రకటన చేశారు.

 ‘లవ్ స్టోరీ’ చిత్రంలో ఉపయోగించుకోవడం పట్ల తనకెలాంటి అభ్యంతరం లేదని కోమలి స్పష్టం చేయగా, రాబోయే తన సినిమాల్లో కోమలితో పాడిస్తానని శేఖర్ కమ్ముల హామీ ఇచ్చారు.  ‘లవ్ స్టోరీ ‘ఆడియో ఫంక్షన్ లో తనతో ‘సారంగ దరియా’ పాట పాడిస్తానని శేఖర్ కమ్ముల చెప్పారని కోమలి వెల్లడించింది.

ఈ నెల 26 భార‌త్ బంద్

రజినీని ఢీ కొట్టబోతున్న జగ్గూభాయ్ !

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్ శుభ‌వార్త !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -