Tuesday, May 7, 2024
- Advertisement -

చర్మంపై దద్దుర్లు రావడం కూడా కరోనా లక్షణమే..!

- Advertisement -

ప్రపంచ వినాశకారిగా మారిన కరోనా వైరస్ వచ్చి ఏడాది దాటుతుంది. మద్యలో కాస్త విరామం ఇచ్చినట్టు అనిపించినా ఇప్పుడు మళ్లీ విజృంభిస్తుంది. కరోనా సెకండ్ వేవ్ మొదలైందని.. అన్ని రాష్ట్రాల వారు తగు జాగ్రత్తలు ఉండాలని ముఖ్యమంత్రులకు సూచనలు ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. అయితే కరోనా ఇంతకు ముందు కరోనా వైరస్ వేరు. ఇప్పుడు అది మారిన తీరు వేరు.. ఒకప్పుడు కరోనా వైరస్ బారిన పడితే తుమ్ము, దగ్గు, జ్వరం ఇలాంటి లక్షణాలు చూపిస్తూ 14 రోజులు టైం ఇచ్చేది.. 60 ఏళ్ళు దాటిన వారికి తీవ్రం గాను, యుక్త మధ్య వయస్సు వారికి స్వల్పం గాను ప్రభావాన్ని చూపేది.కానీ world health organisation (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ముందుగానే చెప్పినట్టు ఈ రోజున కరోనా అత్యంత డేంజర్ స్థితి లోకి చేరుకుంది.

ఏ మాత్రం లక్షణాలు కనబడకుండానే, వయస్సుతో సంబంధం లేకుండా 30 ఏళ్ళ వారినైనా సరే మూడే మూడు రోజుల్లో మృత్యువు ముంగిట నిలిపి మరణ మృదంగం వాయిస్తూ మరలి రాని లోకాలకు తీసుకెళ్లి పోతూ ఉంది. తాజాగా చర్మంపై దద్దుర్లు రావడం కూడా కరోనా వైరస్‌ సోకిందనడానికి ఓ సంకేతమని ఓ అధ్యయనం తేల్చింది. దగ్గు, జలుబు, జ్వరంతో పాటు చర్మంపై వచ్చే దద్దుర్లు కూడా ఓ లక్షణమని గుర్తించాలని తెలిపింది.

వైరస్‌ను తొలిదశలోనే గుర్తించేందుకు ఇది ఎంతో ఉపయోగపడనుందని స్పష్టం చేసింది. వైరస్‌ వల్ల ఏర్పడే దద్దుర్లు ఎర్రగా.. ఉబ్బినట్లుగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు అధ్యయన ఫలితాలు బ్రిటిష్‌ జర్నల్ ఆఫ్‌ డెర్మటాలజీలో ప్రచురితమైంది. యువకుల్లో ఈ లక్షణం ఎక్కువగా కనిపించిందని తేలింది. అలాగే మరో 11,544 మందిని ఆన్‌లైన్‌లో సర్వే చేశారు. వీరిలో 17శాతం మంది కరోనా సోకిన తర్వాత బయటపడ్డ తొలి లక్షణం చర్మంపై దద్దుర్లు రావడమేనని తెలిపారు.

రజినీని ఢీ కొట్టబోతున్న జగ్గూభాయ్ !

వీరి కాంబినేషన్ సూపర్ హిట్టే..!

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్ శుభ‌వార్త !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -