Thursday, April 25, 2024
- Advertisement -

దారుణం.. అందుకు ఒప్పుకోలేదని ముక్కు కోశాడు!

- Advertisement -

ఈ మద్య కొంత మంది ఉన్మాదానికి అడ్డూ అదుపు లేకుండా పోతుంది. తమ కోరిక తీర్చలేదని ఆడవారిపై దారుణాలకు పాల్పడుతున్నారు మృగాలు. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ‌న‌తో పెండ్లికి అంగీక‌రించ‌లేద‌ని ఓ వ్య‌క్తి మ‌హిళ ముక్కు కోసేశాడు. సోమ‌వారం ఉద‌యం యూపీలోని జ‌లౌన్ జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.  కాకపోతే ఈ విషయం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. ఓరాయ్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని ఓ గ్రామంలో మ‌హిళ ఒంటరిగా నివాసం ఉంటున్న‌ది.

వివాహితురాలైన ఆమె భ‌ర్త‌తో వివాదం కార‌ణంగా విడిపోయి గ‌త ఐదేండ్లుగా ఒంట‌రి జీవితం గ‌డుపుతున్న‌ది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమెపై కన్ను వేశాడు.. తన కోరిక తీర్చాలని తనని పెళ్లి చేసుకోవాలని వేధించసాగాడు. కానీ ఆ మహిళ అతని కోరిక తీర్చనని మొరాయించింది. ఈ నేప‌థ్యంలోనే సోమ‌వారం ఉద‌యం కూడా మ‌హిళ ఇంటికి వెళ్లిన వ్య‌క్తి.. త‌న‌ను పెండ్లి చేసుకోవాల‌ని కోరాడు. 

కానీ ఆమె తాను అందుకు ఒప్పుకోనని ససేమిరా అంది.. దాంతో కోపోద్రిక్తుడైన అత‌డు క‌త్తితో మ‌హిళ ముక్కు కోసేసి పారిపోయాడు. స్థానికులు వెంట‌నే ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా ప‌రీక్షించిన వైద్యులు ఆమెకు ప్రాణాపాయం లేదని చెప్పారు. కాగా, ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు పారిపోయిన నిందితుడి కోసం గాలింపు చేప‌ట్టారు. 

ఛీ.. వీడు మనిషేనా.. కుక్కపై అత్యాచారం!

బాబోయ్ పక్షి పొట్ట చీల్చుకొని బయటకు వచ్చి చేప.. అయినా..

తస్మాత్ జాగ్రత్త.. కొత్త మార్పులతో కరోనా వైరస్.. మరో డేంజర్ బెల్!

ఒడిశా అడవుల్లో అరుదైన నల్లపులి..!    

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -