Saturday, April 27, 2024
- Advertisement -

తస్మాత్ జాగ్రత్త.. కొత్త మార్పులతో కరోనా వైరస్.. మరో డేంజర్ బెల్!

- Advertisement -

చైనా వాడి జిమ్మిక్కో.. మన కర్మనో కానీ పుహాన్ లో పుట్టుకు వచ్చిన కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం అతలా కుతలం చేసేసింది. ఒకటి కాదు రెండు కాదు లక్షలు, కోట్ల మంది ఈ కరోనా భారిన పడ్డారు.. పడుతూనే ఉన్నారు. ఈ కరోనా వల్ల మనిషి మనుగడనే ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇప్పటి వరకు ఎన్నో వైరస్ లు వచ్చాయి.. పోయాయి.. కానీ కరోనా మాత్రం మనిషి జీవితంలో కోలుకోకుండా చేసింది. ప్రాణ నష్టమే కాదు.. ఆర్థిక నష్టాన్ని దారుణంగా కలిగించింది. గత మూడు నెలలుగా కరోనా కాస్త తగ్గు ముఖం పట్టిందని భావించి ప్రజలు బయట తీరగడం మొదలు పెట్టారు.. కానీ ఇప్పుడు మరోసారి కరోనా డేంజర్ బెల్ మోగించనుందట.

కరోనా వైరస్ పరివర్తన చెందుతున్నట్టు ఇప్పటికే గుర్తించిన శాస్త్రవేత్తలు ఇప్పుడు మరో హెచ్చరిక చేశారు. వైరస్‌లో సరికొత్త మార్పులు కనిపిస్తున్నాయని, ఈ మార్పు తర్వాత వైరస్ కనుక విస్తృతంగా వ్యాపిస్తే ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న టీకాలు ఎందుకూ కొరగాకుండా పోతాయని హెచ్చరిస్తున్నారు. డెన్మార్క్‌లో మింక్ అనే జీవి నుంచి ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్టు స్టేటెన్స్ సీరమ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు గుర్తించారు. జూట్‌ల్యాండ్ ప్రాంతంలో దాదాపు 1,100 పెంపుడు కేంద్రాల్లో 1.7 కోట్ల మింక్‌లను పెంచుతున్నారు. 207 కేంద్రాల్లో కొత్త రకం కరోనా వైరస్‌ను గుర్తించారు. వీటి వల్ల మొత్తం మింక్‌లకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఐదు మింక్ కేంద్రాల్లో 12 మంది ఈ కొత్తరకం వైరస్ బారినపడ్డారు.  ఈ కొత్త వైరస్ వల్ల మరెంత ప్రమాదాలు పొంచి ఉన్నాయో అని మరోసారి ప్రజలు భయపడి ఛస్తున్నారు.

విద్యార్థులకు జగన్ సర్కార్ భారీ ఊరట

ఒడిశా అడవుల్లో అరుదైన నల్లపులి..!

ఓరి నాయనో.. స్కూల్ తెరిచిన రోజే కరోనా షాక్!

ప్రచార ఆర్భాటాలు లేకుండా పోలవరం పనులు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -