Sunday, May 5, 2024
- Advertisement -

చేతి నరాలు కట్ చేసుకొని మాలీవుడ్ నటుడు ఆత్మహత్యాయత్నం!

- Advertisement -

ఈ మద్య చిన్న చిన్న విషయాలకు మనస్థాపంతో పలువురు ఆత్మహత్యాయత్నాలు చేసుకుంటున్నారు. సామాన్యులు మాత్రమే కాదు సెలబ్రెటీలు సైతం ఇలాంటి పనులు చేస్తున్నారు. మానసిక ఇబ్బందులతో పలువురు నటులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా మలయాళ నటుడు, పలు సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య జయన్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఆదిత్య జయన్, ఆయన భార్య, నటి అంబిలి మధ్య భేదాభిప్రాయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల మీడియా ముందుకు వచ్చిన అంబిలి, భర్తపై తీవ్ర ఆరోపణలు చేసింది. తనకు విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని, చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె ఆరోపించగా ఆ రోజు నుంచి ఆదిత్య మానసికంగా బాధపడుతున్నట్లు సన్నిహితులు తెలిపారు.

ఈ క్రమంలోనే కారులో కూర్చుని అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగిన ఆదిత్య, ఆపై చేతి నరాలను కోసుకున్నాడని తెలుస్తోంది. ఆపస్మారక స్థితిలో ఉన్న ఆదిత్యను గమనించి కొందరు త్రిచూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆదిత్యకు ఐసీయూలో నికిత్సను అందిస్తున్నామని, అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

18 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచిత వ్యాక్సిన్‌!

కేంద్ర ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు సీరియస్

అలాంటివాటి జోలికి ఇక పోనంటున్న యాంకర్ రష్మీ.. కారణం?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -