Friday, March 29, 2024
- Advertisement -

18 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచిత వ్యాక్సిన్‌!

- Advertisement -

దేశంలో పెరిగిపోతున్న కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా 18 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచిత వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ను 18 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచిత వ్యాక్సిన్‌ అందివ్వనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం తెలిపారు. ఉచితంగా టీకా అందించేందుకు 1.34 కోట్ల రూపాయల వ్యాక్సిన్‌ కొనుగోలుకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. వీలైనంత తర్వగా కొనుగోలు చేసి.. టీకా వేయనున్నట్లు ఆయన అన్నారు.

అయితే ఇది ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేయించుకునే వారికే అని ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెళ్లేవారు మాత్రం వ్యాక్సిన్‌కు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా ఎవరినీ వదలడం లేదని ముఖ్యంగా పేద ప్రజలు, వలస కూలీలు కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. టీకా తయారీదారులు వ్యాక్సిన్‌ ధర రూ. 150 ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

మీరు కేవలం డబ్బే సంపాదించాలనుకుంటే.. మీ జీవితకాలంలో ఎప్పుడైనా సంపాదించవచ్చు. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కాదు. అలాగే టీకా ధరల్ని తగ్గించమని నేను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ ధర రూ.150 కొనుగోలు చేస్తోంది. దీనిపై అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాక్సిన్‌ ధరలు అందరికీ ఒకేవిధంగా ఉండాలని నమ్ముతున్నాను అని ఆయన అన్నారు.

ఎంత కష్టం.. కరోనా సోకిన భర్త.. ఆ భార్య ధైర్యం చూస్తే కన్నీరు పెట్టుకుంటారు..

కర్నాటకలో 14 రోజుల లాక్‌డౌన్!

ఆత్మహత్య చేసుకుంటా అంటూ ‘విశ్వక్ సేన్’ని బెదిరించిన అభిమాని.. చివరికి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -