Friday, March 29, 2024
- Advertisement -

జీవితంలో ఆ పని చెయ్యను.. నిర్మొహమాటంగా నో చెప్పిన రష్మీ?

- Advertisement -

సోషల్ మీడియాలో రష్మీ గౌతమ్ తరచు హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ యూత్‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది.రష్మీ చేసే ప్రతి ఫోటో షూట్ కి ప్రశంసలు, విమర్శలు అనేవి వస్తున్నప్పటికీ ఇవేమి పట్టించోకుండా తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోతోంది.హాట్ బ్యూటీ రష్మి గౌతమ్ బుల్లితెరపై ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌, ఢీ షోలతో రచ్చ చేస్తూనే అడపా దడపా సినిమాలు చేస్తూ అందాలను కనువిందు చేస్తూ విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది.

రష్మి గౌతమ్ మొదట వెండితెరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా “హోలీ ” సినిమాలో కనిపించింది. తర్వాత రష్మి గౌతమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వచేసిన “గుంటూరు టాకీస్” అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తరువాత అంతకు మంచి, శివరంజని, నెక్స్ట్ నువ్వే , రాణి గారి బంగ్లా, ఇలా చాలా సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయిన ఈ బ్యూటీకి వెండి తెరపై తగిన గుర్తింపు రాలేదనే చెప్పాలి.

Also read:భోజనం చేసిన వెంటనే వాకింగ్ చేస్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి!

రష్మి ఇటీవలే ఓ సందర్భంలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. నాశరీరాకృతికి బికినీ సరిపోదు. అందుకే భవిష్యత్‌లో కూడా బికినీ వేసుకునే సందర్భం రాకపోవచ్చు అంటోంది ఈ బ్యూటీ.పెద్ద హీరోలతో చేయలేదని నేనెప్పుడూ బాధపడలేదు. భవిష్యత్‌లో అవకాశం రావచ్చు. నేను కష్టజీవినే కాదు, ఆశాజీవిని అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాజాగా రష్మి గౌతమ్ కు నాగార్జున బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా, కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో రష్మి గౌతమ్ ఓ కీలకమైన పాత్రలో నటించడానికి సిద్ధమైందని తెలుస్తోంది.

Also read:రుచికరమైన బంగాళదుంప హల్వా ఎలా తయారు చేయాలంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -